శ్రీనాథుడు : ఆయనది ఒక అద్వితీయస్థానము. భావి విమర్శకులు ఆయనను సారస్వతాకాశ శీతమయూఖుడిగా పరిగణిస్తారు. ఆంధ్ర జాతికెంత వయస్సున్నదో ఆంధ్రభాగవత కన్యకకూ అంతవయస్సు. బావగారు ఆంధ్రభాషను పునీతం చేయటానికి పుట్టిన పుణ్యమూర్తి. కవిత్రయం ఏ మహోన్న తాశయాలతో కవితా వ్యవసాయం సాగించారో, ఆ దృక్పథంతో కావ్య రచనకు పూనుకున్నది మళ్ళీ బావగారే - మల్లన్నా! ఆయన చెప్పుకున్నాడే - 'నా జతనంబు సఫలంబు సేసెద పునర్జన్మంబు లేకుండగన్' అని ఆ విధంగానే ఆయనకు పునర్జన్మ లేదనే నా నిశ్చయము. తన తరణోపాయం చూచుకొని కాలం వెళ్ళబుచ్చుకు పోదలుచుకున్న కవి సామాన్యుడు కాడు ఆ వ్యక్తి. తనతో పాటు ఆంధ్రజాతినంతటినీ మోక్షమార్గ సాంయాత్రికులను చేసుకుంటేగాని సంతృప్తి కలగనట్లుంది ఆయన ఆత్మకు. ద్వైపాయనతుల్యుడు గాని సామాన్యుడా? మల్లన్న : మామా! నీ వింత భావోద్వేగివని నేను ఎన్నడూ అనుకోలేదు. శ్రీనాథుడు : ఈ మాటలన్నీ శిలాక్షరాలు మల్లన్నా! సమస్త కవితా సాగరాలలోనూ నాకు అందుకోలేని అగాధ జలధిలా ఉన్నది మీ నాన్నగారి కవితాత్మ. - ఇదంతా సత్యమని నమ్ము. మల్లన్న సత్యం కాదని కాదు. నీకు అభిమానం కలిగితే అది అవధులు దాటిపోతుందేమోనని నా భయం. లేకపోతే - అష్టాదశ మహాపురాణాలను ఆపోశనం పట్టిన ద్వైపాయన మహర్షికీ మా నాన్నగారికీ ఎక్కడి సామ్యం - ఆయన ఋషిత్వం..... శ్రీనాథుడు : (సోద్వేగంగా) ఆయన ఋషిత్వమేమిటి? ఆయన దార్శనికస్థితిని తలతన్ని పోయినారు బావగారు. మల్లన్న : ఏమో! శ్రీనాథుడు : ద్వైపాయనమహర్షికంటే బావగారిలో ఇంకో విశేషగుణమున్నది. భక్తి భావ పారవశ్యము. మల్లన్న ఒకటి మాత్రం సత్యము. మహర్షిని కవితా వైదగ్ధ్యంలో మా నాన్న మించుతాడు. శ్రీనాథుడు : ఏ మహారాజుకో అంకితమిచ్చేనాడు కవిపండిత సమాజాలు ఏమంటవో వింటావుగా. మల్లన్న : నరాంకితం చెయ్యటానికి నాన్న అంగీకరిస్తాడా? 360 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/360
Appearance