Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీనాథుడు : ఇంకా గడువు చాలా ఉన్నదిగా. మొదటినుంచీ సింగభూపతి ఆశ్రయంలో ఉన్న కవిగూడానై పోయె బావగారు. ఆహ్వానం పంపించకుండా ఉండరు. మాచమ్మ : ఏమో నాయనా? మొదటి మాట మీ బావగారికి ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో కూడా తెలియదు. భోగినీ విషయంలో ఎవరితోనో ఈన ఏదో అన్నాడనీ దానిమీద భూపతి మందలిస్తే ఈన ఏదో పెడ సమాధానం చెప్పాడట. బాగా మనస్పర్థలు ఏర్పడ్డట్లున్నవి. ఈన మాటలను బట్టి చూస్తే ఆహ్వానం వస్తుందో రాదో! శ్రీనాథుడు : సింగభూపతి ఇలాటి చిన్నవిషయాలు మనస్సులో పెట్టుకుండేవాడు కాదు. పైన బావగారంటే విశేషాభిమానం ఉన్నట్లు విన్నాను కూడా. ఆయన మనస్సులో స్పర్ధ ఉంటుందని అనుకోను - నేను ఇవాళనే బయలుదేరి వెళ్లుతున్నానుగా. భూపతితో మాట్లాడి బావగారికి వెంటనే ఆహ్వానం వచ్చేటట్లు చేయిస్తానుగా. మాచమ్మ : ఒకవేళ వచ్చినా ఈన బయలుదేరవద్దూ. - శ్రీనాథుడు : దానికి ఎవరేం చేస్తారు పోనీ మరొక సమయంలో తిప్పయసెట్టి పరిచయం చేస్తాను. మాచమ్మ : అబ్బాయీ! అయితే ఉత్సవాలలో ఆధ్వర్యం నీదేనా ఏమిట్రా. శ్రీనాథుడు : అందుకనే తిప్పయసెట్టి నేనూ ఇంతముందుగా బయలుదేరి రావటము. ఉత్సవ కలాపాలన్నీ వచ్చే పౌర్ణమికి పూర్తి కావాలి. మల్లన్న ఏడిఅక్కయ్యా! బావగారితో వాడుకూడా వస్తే ఎంతో బాగుంటుంది. ఏదో సందర్భంలో సెట్టికీ, సింగభూపతికీ మా కాబోయే అల్లుడని చూపిస్తాను. (దొడ్లో నుంచి మల్లన్న పొలానికి పోవటానికి సిద్ధపడి బయటికి వచ్చి) మల్లన్న : మామా! పొలిమేర చేలో గుంటక తోలటం కొంత మిగిలిపోయింది. త్వరగా పూర్తి చేసుకువస్తాను. శ్రీనాథుడు : అబ్బాయీ! నేను ప్రయాణమౌతున్నాను. నీవు కూడా మీ నాన్నగారితో పాటు రాచకొండ గోపాలోత్సవాలకు తప్పకుండారావాలి. నడిపించేది నేనే. మల్లన్న ఇంత ఆలస్యం చేశావేం మామా! నిన్న సాయంత్రమే బయలుదేరక పోయినావేం. ఏకాంకికలు 353