కామ్రేడ్ : అమ్మా మీ అబ్బాయి...
తల్లి : (వంచుకున్న తల కొంచెం పైకెత్తి) ఎక్కడున్నాడేమిటి?
కామ్రేడ్ : అక్కడ మైదానంలో జరిగే సభ దగ్గిర ఉన్నాడు. ఇందాకటి నుంచీ ఇప్పుడూ అక్కడ బల్లదగ్గిరే... ఉన్నాడు.
తల్లి : ఇంత పొద్దుపోయినా ఇంకా ఎందుకు రాలేదో!
కామ్రేడ్ : (తల వంచుకుంటాడు)
తల్లి : ఏమన్నా చేశాడా ఏమిటి?
కామ్రేడ్ : ఏమన్నా చేయటమేమిటమ్మా! మహోపకారం చేశాడు. ఏమి ధైర్యం! ఎంత వచో నైపుణ్యం! మాట్లాడటంలో కించిత్తైనా ఒడుదొడుకులు లేవు. బీదసాదల దుర్గతిని చూచి కరిగిపోయిన కోమల హృదయం! బాలహృదయం! ఎంత ఆవేశం! మనమంతా ఒక సంఘంగా చేరాలి. ఆ సంఘానికి బలం చేకూర్చుకోవాలి. బాగా ధనికుల దౌష్ట్యాలను రూపుమాపే ప్రయత్నంలో ఉండాలి. ఎప్పుడు, సమాన ప్రాభవ వైభవాలను సంపాదించుకోవాలనీ, ఉద్బోధించాడు. పేదసాదలను, ధనధాన్యాలు శాశ్వతాలు కావని, మానరక్షణ ప్రాధాన్యమట. జన్మజన్మాంతరాలనుంచీ దీర్ఘ సుషుప్తిలో ఉన్న కూలీనాలీలను, మేల్కొల్పి వారి వారి అంతరాలను విభజిస్తూ స్వతస్సిద్ధముగా లేని ధనికుల ప్రాభవాన్ని నిరసించాడు. జ్ఞానతృష్ట కలుగవలెనని హెచ్చరించాడు. అంతేనా ఇంకా...
తల్లి : ఎక్కడ మాట్లాడాడు?
కామ్రేడ్ : మైదానంలో నమ్మా!
తల్లి : (ఆశ్చర్యంతో) అక్కడికి వచ్చాడా! వాళ్ళ నాన్నకు తెలుస్తుందే?
కామ్రేడ్ : అవును. వచ్చాడు. మతులు మారిపోయేటట్లు మాట్లాడాడు. తరువాత మా అధ్యక్షుడు మహానాయకుని పోకడలున్నాయి కుర్రవాడిలో అన్నాడు కూడాను. అటువంటి పిల్లవాడు (చివర వినకుండా)
తల్లి : ఎవరు మాట్లాడనిచ్చారు?
కామ్రేడ్ : ఉత్సాహపూరితుడై తనంతట తానే మాట్లాడతానని అధ్యక్షుణ్ణి కోరాడు. సభలో ఏమి గందరగోళం చేస్తాడోనని ఆయన భయపడి మొదట్లో వీలు లేదన్నాడట.
ఏకాంకికలు
339