తల్లి : వద్దు! నాయనా! మళ్ళా నడిచి మైదానం దాక పోయివస్తే అలసిపోవటం వల్ల జ్వరం తిరగబెడుతుంది. బాగా నయమైన తరువాత ఎక్కడ తిరిగినా ఫరవాలేదు.
కొడుకు : అన్నీ తెలిసి కూడా అలా ఆటంకం చేస్తావేమమ్మా! జ్వరం వస్తే వస్తుంది. మళ్లీ వెనక నయమైనట్లే నయమవుతుంది. అక్కడ చెప్పే సంగతులు నాకు తెలియాలంటే ఎట్లా తెలుస్తాయి. పోతానమ్మా.
తల్లి : ఎప్పుడో నాన్న చెపుతారు విందువుగానివి. ఇప్పుడు పోవద్దు! నా మాట విను.
కొడుకు : (మాట్లాడడు).
తల్లి : ఇక్కడనే కుర్చీలో కూర్చుని ఏదైనా చదువుకుంటుండు. అయిదు కాగానే నాన్న వస్తారు., మాట్లాదువుగాని. అక్కడ చెప్పే సంగతులన్నీ నాన్నకు బాగా తెలుసు. చెపితే నేర్చుకుందువుగాని. నేను ఇంకా మడిగట్టుకోవాలి. ఇవాళ ఆరు గంటలకే భోజనం చేసి నాన్న ఎక్కడికో పోవాలట. త్వరగా వంట చేయమని చెప్పిపోయినారు.
కొడుకు : (అలోచిస్తూ వీథి గుమ్మంలో నుంచి లోపలికి వచ్చి పడక కుర్చీలో చతికిల బడతాడు. తల్లి ఇంట్లో పని చూసుకోను పోతుంది).
ఏవిధంగానైనా ఇవాళ అక్కడికి పోవాలిసిందేను. అమ్మా నాన్న మళ్ళీ నన్ను ఇంటికి రానిచ్చినా సరే రానివ్వకపోయినా సరే! వాళ్ళతో నేను మీతో కలిసి ప్రచారం చేస్తాను, నాకు తిండి గుడ్డలు ఇచ్చి మీ చదువు చెపితే చాలని బతిమిలాడితే ఒప్పుకోక పోతారా!
(లేచి నాలుగు దిక్కులూ చూచి నెమ్మదిగా ఇంట్లోనుంచి బయటికి జారతాడు)
మూడవ రంగము
(సాయంత్రం 7.30 గంటల ప్రాంతము. కుర్చీలో కొడుకు లేకపోవటం వల్ల తల్లి వీథి గుమ్మంలో నిలవబడి ఎక్కడికి పోయినాడో అని కనిపెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇంతలో కొంతసేపటికి ఒక సైకిలుమీద రొప్పుతూ రోజుతూ ఒక కామ్రేడ్ దిగుతాడు ఆమె ముందు)
కామ్రేడ్ : వీరసూనుని కన్నతల్లికి నమస్కారములు.
తల్లి : (తలవంచుకొని ఉంటుంది. ఒకవిధమైన సిగ్గుతో)
338
వావిలాల సోమయాజులు సాహిత్యం-2