కృష్ణపంతు : (లేచి తల్లి దండ్రులకు అత్తమామలకు నమస్కారం చేసి వచ్చి పెళ్లి పీటలమీద కూర్చొని కొంతసేపుండి)
అబ్బా! అబ్బా! బాధ! అమ్మా! (అని కేక వేస్తాడు)
(సభ నిశ్శబ్దం అవుతుంది)
కళ్యాణపంతు, భార్య : నాయనా! ఏమిరా ఇది! చెప్పు నాయనా (అని దీనంగా అడుగుతారు)
కృష్ణపంతు : (మాట్లాడడు - క్రిందకు ఒరగబోతాడు)
ఏలేశ్వరుడు, కల్యాణపంతు : (ఇద్దరు వచ్చి పట్టుకుంటారు. ఇద్దరి భార్యలు కాళ్ళ దగ్గిర నిలవ బడతారు ఏడుస్తూ)
రేవణ శర్మ : నిశ్శబ్దంగా వుండండమ్మా. ఏడ్వకండి. ఏమీ లేదు. ఆలస్యం అవటం వల్ల శోషపోయాడు. కొంచెం పాలిప్పించండి.
కృష్ణపంతు : (లోపలినుంచీ వచ్చిన పాలు త్రాగి తెప్పరిల్లి) కాలం సమీపించింది... మాతా పితృ గురు ఋణాలు తీర్చుకోలేక పోయాను. ఇంకో జన్మలోనైనా ప్రయత్నం చేస్తాను. ఈ జన్మకు నా తుది నమస్కారాలు ఇవిగో (అని నమస్కరిస్తాడు. కళ్ళు త్రిప్పుతూ) నాచీ!... నిన్ను... నిన్ను... అన్యాయం చేస్తున్నాను... కానీ ప్రేమించాను... జ్ఞాపకం ఉంచుకో... శివాజీవివిగా... ఉంటే సంతోషిస్తుంది... నా ఆత్మ.... అని ఏలేశ్వర కళ్యాణపంతుల చేతులల్లో కట్టెలాగా ఐపోతాడు... పెళ్ళి పందిట్లో గగ్గోలుగా ఏడ్పు... వినలేక ఏలేశ్వరుడు బయటికి వస్తాడు. బయట... పూర్వం భిక్షుకగీతం పాడినవాడు మళ్ళా.
జంగమయ్యా గురుడ!
జంగమయ్యా! శివ!
దేహధారణ నున్న
దివ్య లింగమయా!
పుణ్యము పాపము
పూచిన పూవుల
వాసన వదలదు
వదలదు జన్మల. ॥జంగమయా॥
316
వావిలాల సోమయాజులు సాహిత్యం-2