(కళ్యాణపంతు, ఏలేశ్వరుడు ఇంటి చావట్లో కూర్చుంటారు వాళ్ళ ఇద్దరి భార్యలు లోపల గుమ్మంలో కూర్చుంటారు)
ఏలేశ్వరుడు : బావగారూ! ఇవాళ ఇంకో గణకుని దగ్గరనుంచి వివాహ మహోత్సవ పత్రిక వచ్చింది. సర్వవిధాలా రేపటి ముహూర్తమే మంచిదన్నారు. మనం పాణిగ్రహణ మహోత్సవ ప్రయత్నాలల్లో ఉండాలి. మీ ప్రయత్నాలల్లో మీరు ఉండండి.
కళ్యాణపంతు : అన్నిటికీ మీరే వున్నారు.
కల్యాణపంతు భార్య : పెళ్ళికొడుకు వారికి ఆడపనికి వొదినగారే వున్నారు.
ఏలేశ్వరుడు భార్య : మహానందము
ఏలేశ్వరుడు : ఊళ్ళో పెద్దలందరికీ రాత్రే చెప్పాను. రాజుగారికి అంతకు పూర్వమే విన్నవించాను. నజరానా డంకా, బాకాలు పంపిస్తానన్నారు. మహారాణిగారు స్వయంగా వచ్చి వధూవరులకు కట్నాలు చదివిస్తుందట.
కళ్యాణపంతు : శుభముహూర్త నిర్ణయానికి ఘటికాయంత్రం సంగతేమి ఆలోచించారు?
ఏలేశ్వరుడు : బోయీలు కులాలుణ్ణి పిలుచుకోవచ్చి యంత్రనిర్మాణం చేయిస్తామన్నారు.
కళ్యాణపంతు : యాజ్ఞీకుడో మరి?
ఏలేశ్వరుడు : అమ్మాయి పుట్టినప్పటినుంచీ రేవణశర్మ వివాహానికి యాజ్జీకం నాదంటు న్నాడు. అతడే చేయిస్తాడు. (కాసేపాగి) సమిధలకు నిన్ననే చెప్పి పంపించాను. వచ్చాయటగానీ చెట్టెక్కినవాడు కాలు విరిగిపడ్డాడట పాపం.
కళ్యాణపంతు : ఎవరో వస్తున్నారు.
ఏలేశ్వరుడు : మా బావమరది. మీ కోడలు మేనమామ. పంపిన మనిషి వెంటవుండి తీసుకో వస్తున్నాడు.
బావమరది : (కాళ్లు కడుక్కోని) బావగారికి బాబుగారికి నమస్కారం. చాలా సంతోషం ఐంది. అమ్మాయికి మంచి సంబంధం నిశ్చ యించారు.
ఏలేశ్వరుడు : నాయనా శర్మ! ఇంట్లోకి కావలసిన వన్నీ అమర్చవోయి. బావగారూ నేనూ ఇప్పుడే వస్తాము (అంటూ లేచిపోబోతుంటే)
ఏకాంకికలు
313