Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ఏలేశ్వరుడు - కృష్ణపంతు - 'భాగీరథీ' స్నానం చేసి నెత్తిమీద నీళ్ళ కడవలు పెట్టుకొని వస్తుంటారు.) ఏలేశ్వరుడు,


అక్షయ! త్రిభువనాధ్యక్ష! సర్వజ్ఞ!
దేవ! మహాదేవ! దేవతారాధ్య!
భావజ సంహార! భక్తమందార!
భక్తవత్సల! ఈశ! భర్గ! దేవేశ!
భక్త జనాధార! భవ్య సాకార!


అనే శివస్తుతి చేస్తూ రాజవీథిలో నడుస్తూ వుంటాడు. కృష్ణపంతు, నాచీ తోడి బాలికలతో ప్రాతఃకాలం ఆడు కుంటుంటే ఇంటికి దగ్గిరగా వున్న శివాలయంలో చూచి)

కృష్ణపంతు : మహాత్మా! ఆ ఆటలో తన్మయత్వం చూచారూ? రూపం తాల్చి చిరు చెమట ముఖం మీద నాట్యం చేస్తూ ఉన్నది. ముంగురులు పవిత్ర గోదావరీ మృత్తిక శ్రమ వారితో కలిస్తే లేపనం వల్ల అతుక్కుపోయాయి. (కొంతదూరం నడచి) అదుగో! ఇంటిదారి పడుతూ ఉన్నది. ఆటగొల్లు వచ్చినట్లున్నది. అందులో అమ్మాయికి ఆవంత కూడా ఆనందం కనిపించకపోవటం అనేకమార్లు చూచాను. బిక్కమొగంలో దుఃఖమూర్తి ఆవేదన పడుతూ వుంటుంది. లోక ప్రవృత్తి కించిత్తేని తెలుసుకోలేని ఆ పసితనంలో...

(ఇంతవరకూ తలవంచుకొని చెప్పుతూ వున్న మాటలు గురువుగారి ముఖం చూస్తూ చెప్పబోతాడు. ఆయన ముఖంలో స్నిగ్ధత, కనుకొనలలో దాగులాడే దుఃఖాశ్రు కణాలు చూచి)

ముఖం వివర్ణమైన దేమి? ఆ అశ్రుకణాలకు కారణం ఏమి?

ఏలేశ్వరుడు : తండ్రీ! ఏమీ లేదు. అమ్మాయి ఆటలో మైమరుపునకు హృదయం కరిగి ఆనందాశ్రువులు కనుకొలకులనావరించాయి. అంతే.

కృష్ణపంతు : లేదు, లేదు మహాత్మా! ఏదో కలిగిన బాధను కప్పి పుచ్చుతూ ఉన్నారు. చెప్పరాని దైనందునా?

ఏలేశ్వరుడు : నీకు చెప్పరాని దేమున్నది తండ్రీ!... చెప్పేటందుకు ఏమీ లేదు కూడాను. నాకు 'జైముని' రాజాస్థాన పౌరోహిత్యము లేనప్పుడు నా ఏకైక పుత్రిని పెంచటానికి దంపతులము పడ్డ అవస్థలన్నీ అప్రయత్నంగా కళ్ళకు కట్టాయి. అందువల్లనే ముఖం వివర్ణమైంది.


308

వావిలాల సోమయాజులు సాహిత్యం-2