Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏలేశ్వరుడు : (దైవజ్ఞుని చావడిలోనే వుండి) పునర్భూవివాహాన్ని లోకంలో ప్రచారం చేయటంగాని, కన్యా వైధవ్యం చూడటం గాని తప్ప మార్గేతరం లేదుగామాలి. కష్టకాలం వచ్చింది... విధికృతం బలీయం... (కొంచెంసేపు ఆలోచించి) ఇంకా అన్ని శాస్త్రాలు పరిశీలిస్తే... పరిశీలించి నా మట్టుకు ఒక శాస్త్రం ఇలా చెపుతుంటే మనసు కెక్కడి శాంతి. (కొంత సేపాగి) శాస్త్ర పరిశీలనం ఇంకా యెందుకు, శాస్త్రాలలో వున్న ప్రతిముక్క మీద నాకు వెర్రి నమ్మకం ఎందుకు?... అయినా చూస్తాను... ఎలా వస్తుందో వైధవ్యం... తారాబల, చంద్రబలాలన్నీ విచారించి, నిధుల చేత సుముహూర్తం నిశ్చయం చేయిస్తాను. కావలసి వచ్చునంటే నేనే నవగ్రహజపం చేస్తాను. ఇంకా వూరుకుంటే నాచీకి ఎనిమిదేళ్లు దాటుతాయి. తరువాత వచ్చే అపవాదానికి అనుకుంటే లాభం వుండదు. మానవుడు పూర్వం చేసినదానికి ఇప్పుడు ప్రతిగా చేస్తే విధి మాత్రం ఏం చేస్తుంది.

(అని లేచి నెమ్మదిగా ఇంటి మార్గం పట్టుతూ వుంటాడు) రాజవీథిని శైవ భిక్షకుడు ఒకడు,


జంగమయ్యా! గరుడ
జంగమయ్యా! శివ!
దేహధారణ నున్న
దివ్య లింగమయా!
నిఖిల లోకాధీశ
నిర్మల జోతిస్సు
నింగిలో వెలిగేను
నేలపై వెలిగేను జంగమయా

కలుష బుద్ధీ! నీవు
కనుమూయ జూడకో
ఆంతరంగిక యత్న
మాజ్యోతి కనలేదె? జంగమయా


అని పాడే భిక్షుక గీతం వినీ విననట్లుగా పోతాడు


(తెర)


ఏకాంకికలు

307