Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రశేఖరం : మార్చి 99-12-9 ఏప్రియల్ 95-10-6 మే 90-14-3 జూన్ 80-14-5 జులై 60-5-3

భుజంగం : నెలచందాలు వసూలు కావటం లేదు.

చంద్రశేఖరం : నెలంతా తిరిగి నాలుగిళ్ళల్లో వసూలు చేసేటప్పటికి నా తల ప్రాణం తోకకు వస్తున్నది. ఏ ఇంటికి వెళ్ళినా ఎందుకివ్వాలి? భుజంగం గారు లక్షాధికారి కాలేడనా! సమితి ఏం చేసింది? అని అడుగుతున్నారు. చాలా అసహ్యంగా ఉంది ప్రజల ప్రవర్తన.

భుజంగం : ఏడిచారు! ఇటువంటి అవాకులు చెవాకులు మాట్లాడకుండా మర్నాటికల్లా ఆర్డినెన్సు పుట్టిస్తాను.

చంద్రశేఖరం : రోగం కుదురుతుంది.

భుజంగం : నేను మటుకు డబ్బు ఎక్కడనుంచి తెచ్చి పెడతాను?

చంద్రశేఖరం : మూలధనం మొన్న మీకు కావలసి వాడుకున్నట్లున్నారు కూడాను. అయినా అడిగే సత్తా ఉన్న సభ్యుడు కూడా లేడులెండి.

భుజంగం : ఆ భయం ఎన్నడూ లేదనుకోండి - అఁ మరచిపోయినాను. నిన్న ఢిల్లీనుంచి ఒక మిత్రుడు వచ్చాడు. ఆలిండియా సేవాసమితివారు ఈ సంవత్సరంనుంచీ గ్రాంట్లు ఆపివేయటానికి తీర్మానించుకున్నారట!

చంద్రశేఖరం : ఇది జరుగుతుందని వెనుక మీతో నేను అనలేదూ?

భుజంగం : ఊళ్లో నుంచి మనమీద పిటీషన్లు వెళ్ళినవట! ఎంక్వైరీ కమీషన్ ఒకటి వేస్తారట! - కొంచెం లెక్కలు సరిచెయ్యాలి.

చంద్రశేఖరం : నా మొఖం - ఏం సరిజేసేది? అంతా లెక్క గైరుహాజరుగా ఉంది.

భుజంగం : మరి, ఎలాగో సర్దాలి, లేకపోతే మనిద్దరి పీకలమీదికి రావచ్చు.

చంద్రశేఖరం : మీరేమన్నా చెప్పండి. జైలుకైనా వెళ్ళవచ్చునుగాని చిత్తులేని లెక్క సరిజెయ్యటం నాచేతగాదు చాలాకష్టం!

భుజంగం : కష్టం కాబట్టే చూడమనటం - వెధవ దేశం ఎవడైనా బాగు పడుతుంటే ఇంత వోర్చలేదేమండి? వట్టి ఈర్ష్య. ఇందువల్లనే ఇన్ని కష్టాలు వస్తున్నవి. మనకు ధర్మం తప్పింది.


262

వావిలాల సోమయాజులు సాహిత్యం-2