Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావు : మహానుభావుడని వ్రాస్తాను.

రంగడు : మమ్మల్ని గురించో?

రావు : (మీరిద్దరూ నిలవబడండి) ఫొటోతో సహా గ్రామాలల్లో మీ సేవను గురించి వ్రాస్తాను. (ఫొటో తీసినట్లు నటిస్తాడు)

రంగడు : అయితే ఇక వెళ్ళు. ఇదుగో ఈ తడవ పొలిమేరల్లో అబద్ధాలు వ్రాసి కాలుపెట్టేవో కట్టేస్తాము -

రావు : నన్ను మరి నమ్మాలి. నేను కూడా పేదవాణ్ణి కదూ!

ముసలయ్య : అయితే పో బాబూ! - రంగడూ - ఆయనా మనంటి మారాజే! (రావు నిష్క్రమిస్తుంటాడు)

రంగడు : మనంటివాడైతే మనమంటే మండిపడతాడేమంట - ఇదిగో, ఇలా ఒక్కొకళ్ళకు బుద్దిచెపితేగాని మంచి బయటికి రాదురా? - ఈ తెలివిగలవాళ్లు ఎంత దొంగలో నీకు తెలియదు.


(నిష్క్రమణ)


డాక్టరు చైతన్యం

253