రావు : మీరంతా వట్టి మొరటువాళ్లు. మీరు పట్టిన పట్టే గాని మంచీ చెడ్డా తెలియదు.
రంగడు : మాకు తెలియదంటావు. ఉఁ. అబ్బో! మీకంతా తెలిసింది. నాలుగు ఇంగ్లిపీసు ముక్కలు నేర్చుకోంగానే సరేనంటయ్యా! - ఏదీ సదువు సూద్దాము, ఏం రాశావో,
రావు : ఏముందీ! నేనేం రాయలేదు -
రంగడు : ఆ చెట్టుకింద కూర్చోని అన్ని కాగితాలు పాడుసేస్తివి గదయ్యా!
రావు : అది నా డైరీ లే.
రంగడు : అందులో నన్నా నా పేరు రాయవంటయ్యా ఎండలో ఎన్నాల్లో కట్టపడ్డాను.
రావు : నీవు చైతన్యంగారి మనిషివా?
రంగడు : (సంతోషంతో) అవును. ఆ అయ్య యేం సెయ్యమంటే అది సేస్తాను.
రావు : అందుకోసమనే నీ పేరు పేపర్లో పడలేదు.
రంగడు : (ఆశ్చర్యం చూపుతూ) అదేంటయ్యా! ఆ దొర మాలావుదొడ్డాడే! అందుకని నా పేరు పడకపోతే ఆసుపత్రికెందుకయ్యా?
రావు : మీకేం తెలుసు?
రంగడు : తెలియకే గదూ అడగటం - తెలిస్తే అడగటమెందుకు?
రావు : మా 'పత్రిక' ఎప్పుడూ ఒకే ఉద్దేశం పెట్టుకొని పని చేస్తుంది.
రంగడు : ఔను! ఆ సంగతి తెలుస్తూనే ఉంది. ఆ భుజంగం వంటివారిని గురించి మంచిగా రాస్తుంది. - మీరంతా గుడ్డివాళ్ళా ఏమయ్యా! చైతన్యంగారు మాకోసం ఇంత శ్రమపడుతూ ఉంటే ఆయన్ను గురించి ఓ మాటైనా వ్రాశారు గాదట, మావోళ్ళంటున్నారు.
రావు : మా ఇష్టం వచ్చినట్టు వ్రాయటానికి వీలుండదు. ఓ పాలసీ వుంటుంది. దాన్నిబట్టి వ్రాయాలి. లేకపోతే మా ఉద్యోగం పోతుంది.
రంగడు : పాలసీ ఆ - బోలెసీ ఆ! నిజం వ్రాస్తే ఉద్యోగం పోతే దానమ్మ నాయాల్టిది పోతే పోయింది. ముష్టెత్తుకోవచ్చుగదయ్యా! మీ సదువుకున్నాళ్ళే అబద్ధాలు చెపుతుంటే మమ్మల్ని తప్పట్టటమెందుకు?
డాక్టరు చైతన్యం
251