Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ దృశ్యం


(డాక్టరు చైతన్యం ఆసుపత్రి, మిస్ రేణు ముందుగా వచ్చి చిన్న చిన్న కేసులు చూస్తూ వస్తువులను సర్దుకుంటూ ఉంటుంది. దూరంనుంచి క్రింద జానపదగీతం ఉదయవేళ వినిపిస్తుంది)

ఆడగొంతు :


'అప్పుడె మరిశావె మామా! న
న్నప్పుడె మరిశావె మామా!!
            అద్దరేతిరియేళ
            ఆకు తోటలకాడ
            చందమామతొ మనము
            సరసాలాడాము ...అప్పుడె....


మొగగొంతు :


ఎప్పుడు మరిశానె పిల్లా! ని
న్నెప్పుడు మరిశానె పిల్లా!!
             చింతతోపుల్లోన
             వంతపాటను పాడి
             పులకరింతల వలపు
             పొంగుపోశా నోసి .......ఎప్పుడు......


ఆడగొంతు :


అప్పుడు మరిశావె మామా! న
న్నప్పుడె మరిశావె మామా!!
           రంగు గుడ్డలు కట్టి
           కొంగు కొంగూ చుట్టి


236

వావిలాల సోమయాజులు సాహిత్యం-2