Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రశేఖరం : అబ్బే! వాడిని చూచి భయపడటమంటే అత్తను చూచి ఆధునిక అప్ టుడేట్ కోడలు హడలిపోవటం వంటిది. కేవలం అనాక్రానిజమ్ - సరే ప్రొద్దుపోయింది. మళ్ళీ ఒకమాటు కలుసుకొని భవిష్యత్కార్యక్రమం ఏర్పాటు చేద్దాం.

పుణ్యకోటి : మన సంగతి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా!

చంద్రశేఖరం : జయను నీ యింట్లో నడిపించి నీ చేత నాట్యం చేయించకపోతే నేను... వెనక చెప్పానే... ఉఁ

(నిష్క్రమణ)


డాక్టరు చైతన్యం

235