Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


'ఆపూర్య మాణ మచల ప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్
తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే
సశాంతి మాప్నోతి నకామకామీ'


తస్సదియ్యా మంచి మాటన్నావయ్యా మహాప్రభూ! అన్నీ నిన్ను చేరితీరవలసిందే? లేకపోతే మాకు ముక్తేముంది? (భుజంగం కారుచప్పుడు) వచ్చినట్లున్నారే! (లేచి తన సీటులో కూర్చుంటాడు)

భుజంగం : (మణెమ్మతో) మణీ! మహాగొప్పగా నడిపించాము. మన సంగతి ఇప్పటికి బాగా గ్రామంలో అర్థమై పోయి ఉంటుంది. లేకపోతే...

మణెమ్మ : వండర్‌ఫుల్‌గా నడిచింది బండి. ఏమంటారు! రావుగారూ!

(వాళ్ళ వాళ్ళ స్థానాలల్లో కూర్చుంటారు)

మణెమ్మ : ఏమండీ, చంద్రశేఖరంగారూ!

చంద్రశేఖరం : క్షణమాగండి. అంతా అర్థమౌతుంది. సేవాసమితి అంటూ ఒకటి స్థాపిస్తున్నాం నగరంలో.

భుజంగం : మణీ! ఇటువంటి సంస్థ అత్యవసరం కూడానేమో.

మణెమ్మ : నిజం! అద్భుతంగా ఉంది. అప్పటికి అన్ని భూములు మన వౌతవి.

పుణ్యకోటి : (ప్రవేశిస్తూ) మీరు వచ్చేశారే! సభలు బాగా జరిగినట్లేనా?

భుజంగం : అద్భుతంగా - మీరు ఏదో సమితి స్థాపిస్తున్నారు?

(జయ టీపార్టీ సన్నాహంతో బుడేను తీసుకొని వస్తుంది. బుడే అన్నీ అమరుస్తూ ఉంటాడు)

పుణ్యకోటి : అయిదునిమిషాలు మీరు నేను చెప్పినట్లు నడుచుకోవాలి.

చంద్రశేఖరం : ఇటువంటి సందర్భంలో మనకు రావుగారుండటం గొప్ప అదృష్టం!

రావు : భుజంగంగారితో ఉండటమంటే మాకు షీర్ ఫ్లెషర్ అప్పా!

పుణ్యకోటి : వర్గమతవిభేదాలూ వర్ణవ్యవస్థలూ లేవుగనుక బుడేసాహెబును కూడా సభ్యుణ్ణిగా స్వీకరిద్దాం.


డాక్టరు చైతన్యం

229