విషయమాలోచిస్తే ఆపాదమస్తకం కంపిస్తున్నది. దీనహరిజన సోదరుల ఆక్రందనాలూ, అన్యాయకథనాలు ఇంకా చెవులల్లో మార్ర్మోగు తున్నవి. యోధాన యోధులైన స్వాతంత్య్ర భారతయుద్ధ కురువృద్ధు లందరూ అలసిపోయినారు. యువకలోకం మేల్కొంటేగాని విముక్తి లేదు.
జయ : ఔను...
పుణ్యకోటి : ఔనంటే చాలదు. సామాన్య ప్రజలకూ, శ్రామికవర్గాలకూ ధనికవర్గాలతో బాటు సమాన ప్రతిపత్తి కల్పించి గౌరవించే విప్లవం, సాంఘికవిప్లవం, నిరాయుధ విప్లవం, అహింసాత్మక విప్లవం నడిపించే నాయకమణులు అనేకమంది కావాలి. మీది స్త్రీ హృదయం, సోదరీ హృదయం, మాతృహృదయం. రండి! లేవండి!! ఈ రథాన్ని నడిపించటానికి నడుం కట్టుకోండి. మీవల్ల మాకు శక్తి మీకు ముక్తి ప్రజకు భుక్తి జయమ్మగారూ.
జయ : మహానుభావా! ఇది ఉపన్యాస వేదిక కాదు. మాటి మాటికీ మరచిపోతున్నారు.
పుణ్యకోటి : నాలో నిద్రితశక్తి ఎలా మేల్కొంటున్నదో మీరు గమనించాలి. పతితప్రజాసేవకు, పీడిత జనోద్ధరణకు బద్ధకంకణులు కావలెనని మిమ్మల్ని అర్థిస్తున్నాను. (వంగి నమస్కరింపబోతాడు)
జయ : (వారిస్తూ చిరునవ్వుతో) ఇంతకూ టౌన్‌హాల్లో నన్ను ఒక పాటకచ్చేరీ చేయమంటారు, అంతేనా?
పుణ్యకోటి : నిశ్చయంగా! మాట ఇవ్వక తప్పదు.
జయ : సరే కానివ్వండి. (తప్పనిసరిగా అంటుంది)
పుణ్యకోటి : జయ్, జయమ్మగారికీ జై... ఇలా రేపు కోటి కంఠాలు మిమ్మల్ని జయవెట్టుతూ ఉంటే మీ మనస్సుకు ఎంత ఆనందం కలుగుతుందో...
బుడే : (గాభరాగా ప్రవేశించి) హమ్మాయిగార్! హన్నీ నాకీ షిద్ధం షేస్తే పిల్లీ మీద బల్లాఎక్కి... మళ్లీ హెగ్రీ మల్లీ హెగ్రీ మల్లీ మల్లీ హెగ్రీ హెగ్రీ...
జయ : ఏమన్నా పగలగొట్టిందా, త్వరగా ఏడు?
బుడే : హాయ్ హమ్మాయిగార్ (ఏడుస్తాడు)
జయ : పోనీలే. త్వరగా మరొకటి పట్టుకురా.
డాక్టరు చైతన్యం
225