పుట 165 - (సంతోషంతో దీర్ఘంగా నిట్టూర్చి) దెసలన్ జాజులతావి నా ప్రభుని కీర్తిస్ఫూర్తితో నిల్పు నో వసనమ్మా! నిలు మంసభాగములపై వక్షస్థలం బోసి నీ లసదానందమనోజ్ఞలాస్యములకున్ రంగస్థలం బీయెడన్ అసమానమ్మగు నీ కళావిభవ మత్యంతంబు రూపింపవే! పుట 166 - (కుంభవృష్టి తప్పదు) ఉరుమఁగ నిమ్ము శ్రావణపయోదములన్ ఘనగర్జలొప్పఁగాఁ గురియఁగ నిమ్ము, లోకములకున్ బ్రళయంబగు కుంభవృష్టి, తా మురలఁగ నిమ్ము, హ్రాదినుల నుర్వర బీటలు వార, బ్రీతిమై నరిగెద నేఁడు నా ప్రియునకై యభిసారికనై రయంబునన్. పుట 167 - వసంతసేన (ఆకాశంవైపు దృష్టి నిల్పి) ఏ ప్రౌథోజ్జ్వలవేషధారిణిగఁదండ్రీ, నా ప్రియుం జేరఁబో నీ ప్రావృద్ధనఘోరవర్షములతో నీ మేఘ నిర్ధోషలా? ఓ పర్జన్య! పయోధరాజ!! దయలేదో, గుండె రాయయ్యెనో, ఈ పాపమ్మది యేమి? నీకుఁ దగునే యీదాష్ట్యమోహాప్రభో! పుట 167 చూపుతూ వెలిగితే చాలు ఆమెయి మేఘరాజు కఠినాత్ముడు నన్నెరపింప నోసి సౌ దామని! గర్జసేయు భయదంబగు దారుణద్రోణవృష్టి - కా నీ మగవాఁ డతండు, హృదయేశునకై విరహార్తనైన న న్నే మెయిఁ జేర్చెదో ప్రియుని యింటికి నమ్మితినే తలోదరీ! పుట 195 - చారుదత్తుడు: ప్రియా! వసంతసేనా క్రొన్నెల లేఁత వెన్నెలలకున్ సొగసిచ్చెడు దంతకాంతితో ప్రన్ననిచూతపల్లవవిలాసము లొప్పెడు కావిమోవితో, వన్నెలఁ జిన్నెలన్ గలుఁగువారెడ్డి, నీ ముఖకాంతిఁ ద్రావి ఓ యన్నువ! దుర్యశోవిషమయాసవ మేగతిఁ గ్రోల నేర్తునే 210 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/210
Appearance