అనుబంధం (మూలములో (*) గుర్తు ఉన్నచోట్ల వచనం వ్రాసి పద్యాలతో ఆడదలచిన వారి ఉపయోగం కోసం వాటిని ఇక్కడ వరుసగా ముద్రించడమైనది). పుట 117 - సిగ్గేస్తున్నది తరువాత సిరి దయఁ జూచునాఁడు ననుఁ జిత్తజదేవమహోత్సవంబు లే జరిపితి నాధనంబుననె సర్వజనుల్ వినుతింప, నేఁడు నన్ సిరి నిరుపేదఁ జేసె, మది సిగ్గిలుచున్నది చేతులారఁగా మరునకుఁ గాన్కనీయ నొకమాడయు మాకడలేదు మిత్రమా! పుట 119 - తుర్రుమంటుందా బావా! దుడ్డు దొబ్బెడు దొడ్డ దొమ్మర గెడపోరి, దండుగుల్ పెట్టించు మిండకోరి, తంపటల్ తలకెత్తు తాపికత్తెలదు త్త రడ్డిమడ్డిజనాల రంకుతొత్తు నిక్కమాడని బైసి కొక్కెర జలజంత, రొక్కాల వలపుల చక్కిజంత, కోలాట మాడేటి కైలాట నెఱదొడ్డి, గోవాళ్ళ హరియించు గొప్పదిడ్డి, దాటదీపరి, కసుమాల, దాట్లగుట్ట, దుక్కిపిట్ట, పిశాచంబు, దొంగతొఱ్ఱు ఔర, రాజును నాతొ మాటాడకిట్లు పారిపోవునె బావ! ఈ పడుపుకత్తె! పుట 122 - శకారుడు (ముందుకు నడచి) ఆప నెవరికీ శక్యమే అతివ! నిన్నుఁ దరుముచుండఁగ నొంటి నాదరికిఁ జేరి 208 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/208
Appearance