శకారుడు : మెడ వాచింది. ఆభరణాలు లేవు.
అధికరణకుడు : అంతమాత్రాన చారుదత్తయ్య దోషియని నిశ్చయించటానికి వీలులేదు.
శకారుడు : నిన్నటి సాయంత్రం నా ప్రియురాలు, మదనికతో చారుదత్తుని ఇంటికెళ్ళింది. తరువాత దానికీ స్థితి పట్టింది.
అధికరణకుడు : మీ ప్రియురాలు వారి ఇంటికి ఎందుకు వెళ్ళిందని మీ అభిప్రాయం?
శకారుడు : సంగీతం నేర్చుకోటానికి - అది మీకు అనవసరమైన ప్రశ్న.
అధికరణకుడు : శోధనకా! - మదనిక.
శోధనకుడు : మదనికా?... కొంచెం ముందుకు.
మదనిక : (కొంచెం ముందుకు వచ్చి నిలబడుతుంది).
అధికరణకుడు : అమ్మాయీ! శకారయ్యగారు చెప్పేమాటలన్నీ నిజమేనా?
మదనిక : ఆర్యచారుదత్తులు పిలుచుకోరమ్మన్నారని ఉద్యానవనానికి మా అక్కను వర్ధమానకుడు బండి ఎక్కించుకోవెళ్ళాడు.
అధికరణకుడు : మీ అక్కను చారుదత్తయ్య హత్య చేశాడని నీవు నమ్ముతావా?
మదనిక : ఆమెమీద అంతటి అనురాగం ఉన్నవాళ్ళు ఈ ఉజ్జయనీ పట్టణంలో మరెవ్వరూ లేరు.
అధికరణకుడు : శకారయ్యా! వింటున్నావా? దీనికి నీవేమంటావు?
శకారుడు : అది చిన్నపిల్ల. దానికేం తెలుసు, దాని మొఘం. ఆ మాటలు నమ్మవద్దు. చారుదత్తుడే చంపాడు.
అధికరణకుడు : శోధనకా! చారుదత్తయ్య.
శోధనకుడు : చారుదత్తయ్య! చారుదత్తయ్య!!
(ఇద్దరు రక్షకభటులు తీసుకోవచ్చి నిలవబెడితే చారుదత్తుడు వచ్చి తలవంచుకొని నిలవబడతాడు)
శకారుడు : (కోపంతో) ఓరి స్త్రీఘాతుకా! నీ మొఘం చూడకూడదు. పంచమహాపాతకాలూ చుట్టుకుంటవి.
వసంతసేన
193