Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శకారుడు : (పీక నులుముతాడు)

వసంతసేన : చారు... దత్తా (మూర్ఛపోతుంది)

శకారుడు : (చేతులతో ఎండుటాకులదాకా తీసుకోపోయి కప్పి గుటకలు వేస్తూ చేతులు దులుపుకుంటూ) ఉడతను మింగిన పిల్లిలాగా ఉప్పిడిచప్పిడి లేకుండా బావ మళ్ళీ వచ్చేటప్పటికి వెళ్ళిపోతాను. (కూనిరాగంతో).


“రాధమ్మ మాటవిని
రంభ చెడిపోయింది
రామయ్య కైపోయె
లంకకాపురము” రాధమ్మ....

కుంభీలకుడు : (ప్రవేశించి) బావా! వసంతసేన ఏదీ?

శకారుడు : ఏదీ? తప్పించుకోపోయింది.

కుంభీలకుడు: (అనుమానంతో) నిజం చెప్పు.

శకారుడు : (నవ్వుతూ) చంపేశాను బావా! (చూపిస్తాడు).

కుంభీలకుడు : (నిర్ఘాంతపోతాడు).

శకారుడు : నాకేం భయం! ఇది చారుదత్తుడి ఇంట్లో నగలు దాచిపెట్టింది. అవి కాజెయ్యటానికి అతడే ఈమెను చంపాడని అపవాదు కల్పిస్తాను.

కుంభీలకుడు : ఒక పాపానికి మరొక పాపమా! - అంతా నేను వెళ్ళి అధికరణకులకు చెపుతాను.

శకారుడు : నాకేం భయం. చెప్పుకో. తాడూ బొంగరం లేని నీ మాటలు ఎవరు వింటారు. చెప్పుకో - అంతగా అవసరమైతే అక్కగారితో చెప్పి, బావగారితో చెప్పించి, వాళ్ళ ఉద్యోగాలే ఊడబెరికిస్తాను. తెలిసిందా? జాగ్రత్త!

కుంభీలకుడు : ఏముంది - రెండు ఒదులుకుంటే సరి ప్రపంచంలో, మానం, అభిమానం - రాజ్యాలు జయించవచ్చు రాజులు కావచ్చు.

శకారుడు : (కోపంతో) ఛీ! అధిక ప్రసంగం చాలించు - (వసంతసేనవైపు చూచి సంతోషంతో) హఁ హఁ హఁ


186

వావిలాల సోమయాజులు సాహిత్యం-2