వసంతసేన : అంత సాహసం చెయ్యకు.
సంవాహకుడు : అమ్మా! నా కోరికకు అడ్డుపెట్టకు. సంఘసేవ చేయటానికి నాకు మరో సదవకాశం లేదు.
(నిష్క్రమిస్తాడు)
మదనిక : (ఒక్క ఉత్తరీయంతో ప్రవేశించి) అక్కా! అక్కా!! ఘంటమోదకంవల్ల ఇవాళ అన్యాయంగా మనం అధికారుల చేతుల్లో పడేవాళ్ళమే!
వసంతసేన : తప్పించుకోపోయిందా ఏమిటి?
మదనిక : కట్టుగొలుసు తెంపుకొని రాచబాటలో ఒకరిని తొండంతో పట్టుకొని నేలకేసి కొట్టబోయింది.
వసంతసేన : (ఆశ్చర్యంతో) ఆఁ!
మదనిక : జనం చచ్చె చచ్చె అని కేకలు వేశారు. మన కర్ణపూరకుడు అంకుశంతో లొంగగొట్టి -
వసంతసేన: అమ్మా! పరువు కాపాడాడు - ఆ ఉత్తరీయ మెక్కడిది?
మదనిక : మరి తొందరపడకు. విను. జనంలోనుంచి ఒక మహానుభావుడు ఉత్తరీయాన్ని బహుమానంగా కర్ణపూరకుడి కిచ్చాడట!
వసంతసేన : అది జాజిపూల వాసనే వేస్తున్నదా?
మదనిక : (జాగు చేస్తూ) ఈ మధ్య చేమంతిపూలే పెట్టుకోటంవల్ల జాజిపూల వాసనే మరిచిపోయినాను అక్కా
వసంతసేన : చివర నామధేయం ఉందో లేదో చూడు.
మదనిక: (పరిశీలించి) చా... రు
వసంతసేన : ద....త్త - అవునా? మహాభాగుడిదేనా! ఏదీ ఆ మదనిక దగ్గరినుంచి ఓడిచి తీసుకొని కప్పుకొని సంతోషంతో దీర్ఘంగా నిట్టూర్చి (*) నా ప్రియుని కీర్తిస్ఫూర్తితో దిక్కులన్నిటికీ జాజితావులు వెదజల్లే మహత్తరోత్తరీయమా ఇదిగో ఈ అంసభాగము వక్షస్థలము నీవి. నీ ఆనంద నాట్యాని కివి రంగస్థలాలు. నిరుపమానమైన నీ కళాకేళి నక్కడనుంచి నిరూపించు.
——————————————————————
165