Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


జ్యమ్ము సుభిక్షమై వెలియిబాలిన వేళల జూచినప్పుడే
కమ్మని నిద్రకు గలవు కన్నులు - అట్టి దినమ్ములున్నవా?


మలిదేవరాజు మాచర్ల అర్ధసింహాసనం అధిష్ఠించి 'అన్నా! బ్రహ్మన్నమంత్రీ!' అని పిలుస్తుంటే ఈ అంజలి హర్షాశ్రువులతో నిండే దినాలు ఉన్నవా (రెండు చేతులతో తలనొక్కుకుంటూ, ఉష్, ఎందుకో అప్రయత్నంగా బుద్ధి వినోదం మీదికి పోతున్నది.


(ఒకదానివెంట మరొక కోడికూత వినిపిస్తుంది)


కొమ్మన్న : (వేగంతో) ఎవరురా అక్కడ ?


(ఒక సేవకుడు ప్రవేశించి బ్రహ్మన్న కొమ్మన్నలకు ప్రణామం చేసి నిలబడుతాడు)


ఆ కూసిన కోళ్లలో ఒకటి పుంజు, రెండోది పెట్ట. పిలిపించనా, వినోదం చూద్దురుగాని?


బ్రహ్మన్న : (తిక్తస్మితంతో) ఒకటి పుంజు, రెండోది పెట్ట. పుంజు బ్రహ్మన్న. పెట్ట నాయకురాలు, నాగమ్మ. చూడవలసినదేముంది? ఇంతవరకూ పెట్టే గెలిచింది. ముందేమి జరుగుబోతుందో ఇప్పుడే నిర్ణయం చేయదలచు కున్నారా? గౌతమ మహర్షిని మోసగించి ధర్మరాజ్యం పోగొట్టింది కుక్కుటము!


బ్రహ్మన్న చేతిలో సమస్త సంపదలతో తులతూగే అర్ధరాజ్యాన్ని పోగొట్టింది కుక్కుటము!!


కోళ్ళ సంగతితో వెనుకటిసంగతులన్నీ జ్ఞప్తికి తెచ్చారు బావా! కుటిల తంత్రజ్ఞురాలు మాంత్రికురాలు, నాయకురాలు మోసగించి ఒప్పించిన కోళ్ళపందానికే ఒప్పుకోక పోతే -


కొమ్మన్న : (అందుకొంటూ) మాచర్ల అర్ధరాజ్య సింహాసనం మీద మలిదేవ మహారాజు కాంతులు ప్రసరిస్తుండేవి. అర్థరాజ్యానికి మంత్రులైనా అనంత మహదాంధ్రరాజ్యాన్ని స్థాపించేవారు. అయితే, కుక్కుటయుద్ధం -


బ్రహ్మన్న : (నిష్కర్షగా) చూడను. ఒకవేళ ఇప్పుడూ పెట్టే గెలిస్తే పుంజు బ్రహ్మన్నలో ఊపిరి పోసుకుంటూ ఉన్న ఆశ పుటుక్కుమంటుంది.


కొమ్మన్న : బావా! ప్రతి విషయాన్నీ తామింత బ్రహ్మాండంగా యోచిస్తారని ఈనాడు తెలిసింది. క్షమించండి, వెనుకటి కష్టకాలం స్మృతికి తెచ్చాను. (ముందుకు వచ్చి చేతులు జోడించబోతే)

16

వావిలాల సోమయాజులు సాహిత్యం-2