ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శకారుడు : బావా! నేను దాని సంగతి తేల్చుకోంది రాను.
కుంభీలకుడు : నీ మంచికి చెపుతున్నాను. విను వసంతసేనకు నీమీద ప్రేమలేదు.
శకారుడు : నీకెవరు చెప్పారు?
కుంభీలకుడు : ఆమె చేసే పనులవల్లే తెలుస్తున్నది - నామాట విని రా పోదాం.
శకారుడు : (రానని తల త్రిప్పుతున్నాడు)
కుంభీలకుడు : (నిష్క్రమిస్తాడు)
మైత్రేయుడు : ఓరిత్వాష్టమా! ఇంకా ఇక్కడనే నిలబడ్డావేం!! వికిరపిండం (కర్ర ఎత్తుతాడు).
శకారుడు : (కొన్ని అడుగులు వేసి వెనక్కు తిరిగి) జాగ్రత్త! మా పిల్ల ఒంటినిండా నగలతో మీ ఇంట్లో ప్రవేశించింది. వ్యవహారం అధికారుల చేతుల్లో పడకముందే మా పిల్లను మాకు తెచ్చి ఒప్పచెప్పమను చారుదత్తుణ్ణి. లేకపోతే (కత్తి చూపిస్తూ) జాగ్రత్త!
(బెదిరిస్తూ నిష్క్రమిస్తాడు).
మైత్రేయుడు : ఏడ్చావులేవోయ్ యంబ్రహ్మ!.
——————————————————————————
126
వావిలాల సోమయాజులు సాహిత్యం-2