శకారుడు : (రదనిక మైత్రేయులను చూచి కుంభీలకుడితో పాటు వెళ్ళిపోతాడు).
మైత్రేయుడు : బల్యన్నం క్రిందపెట్టి చేయి అడ్డం పెట్టుకొని చూస్తూ) ఎవరక్కడ? రదనికా?
వసంతసేన : (ముందుకు వచ్చి వెనక పరిచయమున్నట్లు). అయ్యా! ఈ ఇల్లు తమదేనా?
మైత్రేయుడు : ఎవరు? వసంతసేనా! ఇది చారుదత్తుడి ఇల్లు.
వసంతసేన : (స్నేహంగా ఆలయం నుంచి వస్తూ ఒంటరిగా ఇంటికి వెళ్ళటానికి భయపడుతూ ఉన్నాను. మదనిక వచ్చేటంతవరకు నేను మీ ఇంట్లో (రదనిక చేతిలో దీపం ఆరిపోతుంది).
మైత్రేయుడు : రదనికా! ఇలాతే, ఈమెను ఇంట్లోదించి దీపం వెలిగించుకో వస్తాను. బల్యన్నాన్ని కుక్కలు ముట్టుకోకుండా కాపాడాలి. మదనిక : బాబయ్యా! త్వరగా రావాలి.
మైత్రేయుడు : ఇక్కడున్నట్లు వస్తాను (వసంతసేన నుద్దేశించి) అమ్మాయీ! (దారిచూపిస్తూ వెళ్ళిపోతాడు).
(శకారుడు కుంభీలకుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొంటూ వస్తుంటారు)
శకారుడు : బావా! బావా!
కుంభీలకుడు : బయలుదేరు.
శకారుడు : ఇంకా అక్కడ ఎవరో మనుష్యులు!
రదనిక : (ఛీ, ఛీ - కుక్కను విదలించినట్లు) బాబయ్యా! బాబయ్యా!!
శకారుడు : బావా, మనను వంచించటానికి గొంతుమార్చేసింది! (పోయి రదనిక చేయి పట్టుకుంటాడు).
రదనిక : మైత్రేయయ్యా! బాబయ్యా!! పరాభవము! పరాభవము!!
మైత్రేయుడు : (ఒక చేతితో దీపము రెండో చేతిలో కర్రతో ప్రవేశిస్తూ) ఆఁయ్! ఎవడ్రా అది? (దగ్గరకువచ్చి శకారుణ్ణి చూపిస్తూ) అమ్మాయీ! వీడేనా? - మాట్లాడవేంరా బెల్లంకొట్టినరాయిలా? ఏం చేశావు?
—————————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2