మైత్రేయుడు : (వెటకారంగా) పాపము!
చారుదత్తుడు : (ఆలయంవైపు చూస్తూ) ఈమధ్య కొంతకాలంనుంచీ ఆలయంవైపున రావటానికే కాళ్ళాడటం లేదు సిగ్గేస్తున్నది.
(*) శ్రీదేవి నామీద దయ ఉంచిన దినాలల్లో నా ధనంతో చిత్తజదేవుని మహోత్సవాలు ప్రతివత్సరం జరిపించాను.
ఒకనాటి కైంకర్యానికి కూడా ఈనాడు నా దగ్గిర ఏమీ లేదు.
మైత్రేయుడు : చాలు. చాల్లే! పెట్టిందంతా చాలదూ! ఇక్కడుంటే ఇంకా నీకేనో ఇటువంటి ఊహలే కలుగుతుంటవి. లే!
చారుదత్తుడు : (దృష్టి వసంతసేన, మదనికలు వదలిపోయిన పూజాపాత్రికమీద పడుతుంది) పాపం! ఎవరో ఇది మరచి ఇంటికి వెళ్ళిపోయినట్లున్నారు.
మైత్రేయుడు : ఆ ఏదీ - మా అక్కగారు తులసీమందిరం ముందు పెట్టుకొని పూజ చేసుకోటానికి ఎంతో బాగుంది.
చారుదత్తుడు : (పూజాపాత్రలో ఉన్న ఒక పూవు చేతికి తీసుకుని వాసన చూస్తూ) ఎవరైనా ఆలయవనంలో పూలకోసం తిరుగుతున్నారేమో!!
మైత్రేయుడు : (లేచి నాలుగుదిక్కులూ కలయచూస్తూ ఉండగా ఒకవైపునుంచి మదనిక వసంతసేన వచ్చి చారుదత్తుని ముందు నిలబడతారు)
చారుదత్తుడు : (వెనుకగా వసంతసేన నిలుస్తుంది. మదనిక చారుదత్తునివైపూ, పూజాపాత్రికవైపూ ఒక మాటు దృష్టిని నడిపిస్తుంది) అమ్మా, ఇది మీదేనా? తీసుకువెళ్ళండి - (అని అందిస్తాడు)
మదనిక : (వసంతసేనను ఉద్దేశించి) ఇది మా అక్కగారిది. వసంతసేన : (ముందుకువచ్చి నమస్కరించి లజ్జతో నేలబొటనవ్రేలితో వ్రాస్తూ నిలుచుంటుంది)
చారుదత్తుడు : జయోస్తు - శుభమస్తు - అమ్మా! నీ పేరు?
మదనిక : వసంతసేన!
చారుదత్తుడు: (చకితుడై) వీణావాదనంలో విశేషప్రజ్ఞావంతురాలని విఖ్యాతిగన్న వసంతసేనవు...
—————————————————————————
117