భగవంతుడు అనుగ్రహించు
నే దేవుని తెలుసుకొందు
గాఢముగా ప్రేమింతును
కీర్తింపగవలె దేవుని
వందనమ్ము లీయగవలె
ఎచట శాంతి ఉంటుందో
అచట దేవు డుంటాడు
భగవంతుడు సృష్టించును
మనుజుడు రూపమ్ము నిచ్చు
దైవసూత్రములను నేను
అనుసరించి తీరవలెను.
ఎవడధికముగా నెరుంగు
అత డల్పముగా చెప్పును.
వినతి వల్ల ఎన్నండును
ఏ లోపము ప్రాప్తించదు.
పతనానికి పూర్వము కడు
దొడ్డగ పెరుగును గర్వము
మహనీయులు అంద రొకే
పద్ధతిగా యోచింతురు
అరయంగా సారళ్యము
అత్యుత్తమమౌ పద్ధతి
శ్రద్ధారాహిత్య మొక్క
దుష్టమైన ఆచారము
స్వగృహాన్ని పోలినట్టి
స్థాన మెద్ది కనుపింపదు
అల్పముగా మాటాడుము,
అధికముగా కృషిచేయుము
ఆకాశపు వర్ణ మ్మది
అందమ్ముల నీలిమమ్ము
తీయని తావిని వహించి
ఉండు గులాబీతరువు
ఉత్తమమౌ ధ్యానమ్మును
విడిచిపెట్టబోకు మెపుడు
ముఖ్యమ్మగు అవకాశము
కోసమ్మే వీక్షింపుము
సద్గుణాని కయ్యదియే
సాటియైన బహుమానము
ఋణము తీసుకొనుటకంటె
క్రయము చేసుకొనుట మేలు
వీరులైన యట్టివారి
విధి అనుగ్రహించుచుండు
ఎల్లవారి తృప్తిపరుచు
టెంతో ఘనమౌ కష్టము
పనిచేయుము సర్వత్రా
అదిపగలై ఉన్నపుడె
మన అందు వసించు ఆత్మ
ఎన్నండును మృతినొందదు.
ఎన్నో వాలుకలు[1] కలిసి
మహానౌకనే ముంచును
ఆరోగ్యము ఘనభాగ్యము
క్రమము తప్ప కెపుడు గడి
యారమువలె ఉండవలయు
మధ్యాహ్నమ్మున భుజించి
కొద్దిసేపు కూర్చుండుము
రాత్రి భోజనమ్ము పిదప
నడువుము నీ వొక్క మైలు
సిద్ధాంతా లాచరణలు
యోగ్యాలై ఉండవలెను
- ↑ వాలుకలు - ఇసుకలు
________________________________________________________________________________
840
వావిలాల సోమయాజులు సాహిత్యం - 1