తన్ను సర్వస్వతంత్రుండు
ఐన మహాపండితుండ
అని ప్రకటించక భక్తిప్ర
బోధకుగా మాత్రమ్మే
ప్రకటించుట కేమి హేతు
వని ఎందరికో సంశయ
మబ్బవచ్చు. ఆయనగ్రం
థాలవల్ల ఒక్క మహా
భక్తరూపమున నుండుట
యే ఆయన హృదయానికి
సర్వాభీష్టమ్మని గా
ఢముగ వెల్లడౌతున్నది.
ఏ విద్యావైభవమ్ము
భగవాను డనుగ్రహించె
దాని తాను జీర్ణముగా
వించుకొని లోకంలో
భక్తి ప్రబోధము చేయుట
చేతను తా పరమేశ్వర
ఆరాధన, ధర్మప్రబో
ధము తద్వారాను భార
తోద్ధరణము చేసియె కృత
కృత్యుడ గాగలనని సం
పూర్ణముగా నమ్మినారు
దాసుగారు. తమదు హరిక
థోపదేశ మూలంగా
సకల హృదయ క్షేత్రాలలొ
భక్తిబీజముల నాటిరి.
అవి క్రమంగ లతాప్రతా
నమ్ము లౌచును కుసుమించి
ఫలించి తమ సువాసనల
నలుదిక్కుల వ్యాపింపగ
జేసినవి. ఆయన గురు
మూర్తులైరి తాము తరిం
చిరి. ఇతరుల తరింపగా
జేసిరి. పితృమూర్తులైరి.
నైజమ్మౌ కరుణాత
రంగితాంతరంగముతో
అంతేవాసులవి కష్ట
సుఖముల గనిపెట్టినారు.
వారి నుద్ధరించినారు.
దివ్యమూర్తులై వారల
హృదయాంతరముల ప్రవేశ
మొనరించిరి సన్మార్గుల
గావించిరి. ఇలా వారు
వారి శిష్యసందోహా
నికి ఋషిపితృదేవతా
మూర్తులుగా నొప్పినారు.
—♦♦♦♦§§♦♦♦♦—
47 నారాయణదాస గురూ!
గురువుల కొ పెద్దగురూ!!
ఎక్కడున్న మీరు భట్ట!!
పిల్లల మైనట్టి మమ్ము
బ్రహ్మీసమయాన లేపి
వామనస్తుతిని పఠింప
జేసి పిదప ఈ పాఠము
కంఠస్థము చేయింతురు.
మన అందలి ప్రతిఒక్కరి
ఉపాయనలు
839