వా డపూర్వవ్యక్తి శ్రీమ
దాదిభట్ట నారాయణ
దాసుగారు. ఈయన కే
వలము ఒక్క హరిదాసెకాదు
కాదు- అంటే జీవికకై
ఈషణ్మాత్రముగను నా
దోపాసన, సాహిత్యో
పాసనమ్ము చేసి వాని
నవలంబించినవాడా!
కాడటంచు నా భావన!!
ఆయన అవతారమూర్తి
విద్యావైదుష్యమ్మును
గాంధర్వ కళాశక్తియు,
కవితామృదుమధుర చమ
త్కారోక్తియు ఇత్యాదులు
శ్రీ మాతృక దయాభిషం
గము లేకుండాను లభిం
చునవి కావు లభియించిన
శోభించెడి వెపుడు కావు.
దాసుగారి కివి అన్నీ
వెన్నతోడి బెట్టినట్టి
విద్య లౌటయే కాదు
అమ్మవారి వెంట అంటి
ఉండి ఎపుడు ఉండగవలె
లేకపోతె అంతటి గం
డరగండడై కళామూర్తి
ఔట అసంభవము గదా!
వారి మూర్తి విశేషమ్ము
ఈభావన శతధా బల
పరుస్తోంది వారి మూర్తి
సౌందర్యం వారిదేను.
అట్లనటం కంటే అద్ది
దాని దనుట సముచితమ్ము!!
ఎందుకంటె ఆకారం
పుష్టిమంత మై కదలిన
ఒక్క 'కళాపర్వతమ్ము'
కదలినట్లుగా ఉండును.
ముఖము బ్రహ్మవర్చసుతో
భాసిస్తూ ఉంటుంది.
శిరోజాలు మధ్య ఉన్న
పాపిటతో ద్విధా విభజి
తమ్ము లౌచు వంపులు తిరి
గిన అలకలతో విశాల
పాలభాగసౌందర్యము
వీక్షచేయు మధుపపుంజ
ము[1]
ను బోలుచు ఇరుప్రక్కల
తైల నైగనిగ్యమ్మున
అలరారును, వారి విపుల
నేత్రమ్ములు భావగభీ
రము లగుటయె కాక ప్రపం
చాన్ని తృణ ప్రాయంగా
నెంచగల్గు పరిభావన
చేత నెంతొ గభీరాలు.
శ్రవణమ్ములు కుండలాల
చే నలంకృతాలు, సుదీ
ర్ఘమ్ము అయిన ఘననాసిక
నిండా వెండ్రుకల నొప్పు
కన్నుబొమలు ఒక దానిని
- ↑ మధుపపుంజము = ముంగురుల రాశి
________________________________________________________________________________
ఉపాయనలు
823