Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/805

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బాధించుట పెచ్చు పెరిగె
వాని సంహరించుటకై
పడతి పార్వతికి, శివునకు
పుత్రు డొకడు పుట్టగవలె
ఘోరతపము నందు నున్న
పరమశివుని తీక్ష్మబుద్ధి
ఆయనకడ సేవజేయు
పార్వతిపై ప్రసరింపగ
జేయవలయు, చిలకతేరు[1]
నెక్కి నీవు ఓ మన్మథ!
ఓ రతిపతి! రతికేళీ
సార్వభౌమ!! రతీదేవి
అవసంత, మలయానిల
గంధవాహ[2] శుక పిక సం
దోహముతో చేరు మటకు
ముల్లోక క్షేమార్థము
వీరుడవై వర్తింపుము
విజయమ్మును సాధింపుము
లెమ్ము, పొమ్ము," అని ప్రోత్సా
హించి పంప, "కార్యమ్మును
సాధించెద, విజయమ్మును
గైకొనియెద" అంటునమ్మ,
ప్రోత్సాహక వస్తువులతో
అచటి కేగి సమయానికి
తగినట్లుగ సిద్దపడెను.
శృంగారరసాధి నేత
శృంగారరసోద్దీపన
శక్తిమంతు డౌ మదనుడు
సమ్మోహన రూపంతో
సహజ భక్తిభావంతో
విచ్చేసెను నగనందిని!
విశ్వసృష్టి కానందిని
ప్రతిమరూపమున తోచే
పరమశివుని చేరి ఆమె
స్నిగ్ద సౌకుమార్యంతో
అంజలించి, పరిక్రమించి
ఎదుట నిల్చి ఎదనొసంగి
పుష్పాంజలి నర్పించే
సమయంలో [3]
నిజదళాన్ని హెచ్చరించి
అరవిందాస్త్రమ్ము ప్రయో
గించినాడు, తపశ్శీలి
శివుని శరీరమ్ము కొంత
సంచలించె పార్వతి గనె
మదనునిగనె తక్షణమే
నొసటి కంటిమంటతో
రతిపతి దహియించె శివుడు
పార్వతి అదృశ్య అయ్యె
ఆత్మజుగా పతిని రతికి
నొసగి శివుడు మరల తపము
నారంభము గావించెను

—♦♦♦♦§§♦♦♦♦—

తండ్రి దక్షుయజ్ఞవేళ
విష్ణువునకు తన భర్తకు
యుద్ధము సంప్రాప్తించుట
భద్రతకై బ్రహ్మ తన్ను
అతనిలోన నిలిపెగాన
తన శీలముపై అనుమా
నమ్ము కల్గి యుంటచేత

  1. మన్మథుని వాహనము
  2. = వాయువు
  3. పుష్పధన్వి = పూవిల్లు కలవాడు - మన్మథుడు

________________________________________________________________________________

ఉపాయనలు

805