Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/804

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



"మేనకగర్భాన శివుని
పత్నియైన సతీదేవి
నగరాజుకు జన్మించును”.
అని తెలిపిరి మహాదేవు
పరమేశ్వరు, శివు నందరు
శ్రద్ధతోడ స్తుతియించిరి.
మేనకకును నగరాజుకు
మైనాకాదులు పుత్రులు
జన్మించిన పిదప పుట్టి
నది పార్వతి జాతకమ్ము
చూపింపగ బిడ్డ అంద
చందాలను తెలియజెప్పి
తేరిచూచి వందనమిడి
“ఈమె పతి దిగంబరుండు
శ్మశానాన వసియించును.
అయిన నేమి? పరమశివుడు!
అమ్మా! ఓ మేనకాంబ!
చింతింపక - మీ పుత్రిని
పరమశివునకే యిండు”
అంటు చెప్పి నారదుండు
అధికముగా [1]నతుల నంది
అమరలోక మరిగినాడు.

—♦♦♦♦§§♦♦♦♦—

13  సృష్టిని గావింపు మంచు
బ్రహ్మ శివున కాజ్ఞ ఇచ్చె
నిర్వహింప నీ కార్యము
తగిన శక్తి నొందుటకై
హిమనగాన శివుడు మహా
తపము చేయుచున్నాడు.
దేవతలకు తారకాసు
రుని వలన నుపద్రవమ్ము
అధికమయ్యె ఆ రాక్షసు
సంహరింప శివుని సుతుడు
తప్ప అన్యు లెవరు చాల
రన్న విషయ మింద్రాదుల
కందరికీ తెలిసినదే!
తపము నాపి, శివుడు కుమా
రుని పొందెడు విధమును క
ల్పింప నొక్క ఆలోచన
చేసి [2]దివిజులంద రొక్క
నిర్ణయమ్మునకు వచ్చిరి.

—♦♦♦♦§§♦♦♦♦—

14  ప్రతినిత్యము పుష్పాదుల
సంతరించి సమ్మోహన
వేషంతో శ్రద్ధతోటి,
భక్తితోటి కాబోయే
పతికి సేవ గావింపగ
హిమవంతుడు తనపుత్రిని
శివుని తపోభూమి కంపు
టెరిగినారు ఇంద్రాదులు,
అమరాధిపుడా మదనుని
గౌరవముతో పిలువనంపి
పీఠమిచ్చి, అంద రెరుగు
నటులుగా అర్ధాసన
గౌరవమ్ము నబ్బచేసి
"పుష్పబాణ! పరమవీర!
నీ అనన్యశక్తితోడ,
నీ అనుపమరక్తితోడ
పనివడినది పంచాస్త్రా[3]
తారకాసురుడు మనలను

  1. నతులు = మ్రొక్కుదలలు
  2. దివిజులు = దేవతలు
  3. పంచాస్త్ర = అయిదు పుష్పములు (చూతము మొదలైనవి) అస్త్రములు గా గలవాడు

________________________________________________________________________________

804

వావిలాల సోమయాజులు సాహిత్యం-1