పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



త్యాగము


దైవానురాగ శూన్యాలే సంప్రదాయములు కేవల
భౌతికములు, మానసికములైన అనుష్ఠానములు (క్రియాచరణములే)
శాస్త్రవిధుల వ్రతములలో దైవపూజనములందున
దాంభిక కర్మాచరణము ఎంతగ భారమ్మయినను
అవి ఎపుడు తమంత తాము ఆధ్యాత్మిక నిష్ఠితమ్ములై ఒప్పవు వీక్షింపగ
అతడి భక్తి సూత్రాలలో భక్తిని నారద మహర్షి
పరమ ప్రేమ రూపమ్మని నిర్వచించినాడుమున్నె.
ప్రణయము పరిపూర్ణంగా ప్రభుసంగమ మొందుటతో
పరాకాష్ఠ నొందుతుంది భక్తుని ప్రణయము పెరుగగ పెరిగిన
పరమ ప్రేమాన్వితుడును పరమ రమ్యమూర్తియునే
ప్రభుని పొందుటకు నిరతము నాతని యభిలాష పెరుగు.
అతడు సర్వేశ్వరునకు సన్నిహితుడు సారూప్యుడు
నౌచు ప్రవర్తింపగలడు సకల ప్రాపంచిక బం
ధాలతో, ఆకర్షణలతో జీవన మశ్రద్ధ నొందు
ఈశునితో సంయోగము నొందుటయే అతని ఏ
కైకమ్మగు విషయమౌను
ఏమైనా ఆసక్తుడు, ఎంతటి ఉత్కంఠనున్న
జగమును, కర్తవ్యములను త్రోసిపుచ్చబూనుకొనడు
ప్రాపంచికములును, పుణ్యములునునైన కర్తవ్యము
లన్నిటి నిస్వార్థముతో పరమేశుని పాదద్వయ కర్పించుట కొనరించును
ఈశ్వర సంసిద్ధికి నవకాశయొక్క త్యాగముననె
త్యాగ మన్న సంఘకుటుంబాల విడిచిపెట్టుటన్న

______________________________________________________________________________________

438

వావిలాల సోమయాజులు