Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయం సభలో, మహామంత్రి తిమ్మరుసు పాత్ర నిర్వహిస్తున్న జమ్మలమడక మాధవరామశర్మగారు -


“స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గె నీ
యతులిత మాధురీమహిమ...?"


అంటూ పృచ్ఛ చేస్తే - ధూర్జటి పాత్రనభినయిస్తున్న సోమయాజులు గారు వెంటనే అందుకొని,


"..................ఔ. తెలియందగు లోకమోహనో
ద్దత సుమసాయక ప్రబలతాప మహోజ్జ్వల పూజ్యపార్వతీ
పతిపద మంజులాబ్జ మధుపాన మధువ్రతుడై చెలంగుటన్”


అంటూ ఆ పద్యం పూరించారు సభికుల కరతాళధ్వనుల నడుమ 1956 జులై 12 నాటి ఉదంతమిది.

.............................

స్వాతంత్ర్యోద్యమ దీక్షతో, జాతీయ విద్యాభిమానంతో, మహిళాభ్యుదయాభిలాష తో, ఉన్నవ వారి శారదానికేతనానికి ప్రిన్సిపాలై త్యాగబుద్ధితో పనిచేశారు. స్వాతంత్ర్యం మన ప్రాంగణం చేరేవరకు ఖద్దరు తప్ప కట్టలేదు. 'మణిప్రవాళం' (1952) వంటి ఉన్నత సాహిత్య ప్రమాణాలు గల అపురూప పాఠ్యగ్రంథాన్ని విద్యార్థుల కందించారు. 'నాయకురాలు' (1944) వంటి గొప్ప నాటకాన్ని సృష్టించారు. తన విద్వత్తుచేత ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి వంటి సాహిత్యమహోపాధ్యాయుని మెప్పు పొంది, కట్టమంచి రామలింగారెడ్డి గారివంటి మహనీయుని వలన, పండిత - లెక్చరర్ పదవీ నిర్వహణకై ఎగ్జెంప్షన్ పొందగలిగారు. గుంటూరు హిందూ కళాశాలలో 30 ఏండ్ల కాలం సాహిత్యాధ్యాపకులుగా వుండి, ఎందరెందరో విద్యార్థులు విద్వత్కవులుగా, సాహిత్యాచార్యులుగా రూపొందడానికి దోహదం చేసిన గురుదేవుడు సోమయాజులు గారు. చూచేవాళ్లకు కళ్లు చెదిరే రూపలావణ్యం కలిగిన్ని, ఎన్నడూ తన కన్ను చెదరనీయని శీలసంపద నిండుకొన్న నిష్టాగరిష్ఠుడాయన. ఆచార్యుడై, కవియై, ఋషియై మహామానవుడైనా డాయన.

ఇంతటి మహనీయ సాహిత్యమూర్తి కావడం చేతనే ఆంధ్రసాహిత్య లోకం ఆయన్ని మహదానందంతో అభిమానించి, ఆదరించి, ఎన్నెన్నో సన్మానాలు జరిపింది


శివాలోకనము

31