వావిలాల వారి సాహిత్య జీవనం
శ్రీవావిలాల సోమయాజులు గారి సాహిత్యచరిత్ర అంటే - అర్ధశతాబ్ది గుంటూరు సాహిత్యచరిత్ర అన్నమాట. యాభై యేండ్ల పాటు రేయింబవళ్లు, అధ్యయన, అధ్యాపన, రచనా, ఉపన్యాస వ్యాసంగాలతో గడచిందాయన జీవితం. సాహిత్యం వినా మరొకటి ఆయన పట్టించుకోలేదు. పోనీ, గృహస్థయి వుండి, ఇల్లూ వాకిలీ అయినా పట్టించుకొన్నారా అంటే అదీ లేదు. బలిష్ఠమూ, సుందరమూ అయిన తన శరీరారోగ్యాన్నీ లక్ష్యపెట్టలేదు. సాహిత్య మొక్కటే పని అదే లక్ష్యం, అదే జీవితమూ, జీవనమున్నూ.
గేయాలు వ్రాశారు, పద్యాలు వ్రాశారు, సాహిత్యవిమర్శలు వ్రాశారు. చరిత్ర పరిశోధనలు వ్రాశారు సభల్లో మహోపన్యాసాలు చేశారు. మృదుమధురంగా వ్రాసి, ఊరూర కమ్మగా పాడారు. సాహిత్య సమావేశాల్లో, రేడియో నాటికలూ, ప్రసంగాలూ వ్రాశారనేకం. సంగీత, నృత్య రూపక రచనకు ఒరవళ్ళు పెట్టారు. జయదేవుని 'పీయూష లహరి' అనే సంగీత నృత్య నాటికను తొలుదొల్త తెలుగువారికి పరిచయం చేసినవారు సోమయాజులుగారే. దాన్ని తెనుగు చేశారు కూడ, జయదేవుని ఇంపుసొంపులు తగ్గకుండా.
విశ్వనాథ తర్వాత అంత పెద్దయెత్తున వివిధ సాహిత్యరీతులలో రచనలు చేసినవాడూ, దేవులపల్లి తర్వాత, ఆంధ్ర దేశమంతటా సాహిత్యసభల్లో జనరంజకంగా ఉపన్యాసాలు చేసినవాడూ, వాసిలోనూ, రాశిలోనూ శ్రేష్ఠుడనిపించుకొన్నవాడూ శ్రీవావిలాల సోమయాజులుగారే. విద్వత్తుకు విద్వత్తూ, ప్రతిభకు ప్రతిభా, బహుముఖప్రజ్ఞా, అనంత సృజనాశక్తి కల వాడాయన. విశ్వనాథ, దేవులపల్లిలలో లేని సాహిత్యవిమర్శా, చరిత్ర పరిశోధనలనే విశేషకౌశలం వీరికి కైవసమైంది.
ఆంధ్రదేశంలోని సంగీత నాట్యరీతులపై వారి పరిశోధనవ్యాసం చాలామందే వ్రాసినా, 1948 సెప్టెంబరు భారతి సంచికలో వెలువరించారు. అలాగే వాత్స్యాయన కామసూత్రాలపై వ్యాఖ్యానవ్యాసం 1947లో అమరావతిలో జరిగిన ఆంధ్ర సామ్రాజ్య
శివాలోకనము
29