తే. ఒకపరి మాత్రమే శరణాంది యంత
“నేను నీ వాడనే” యని నిలిచి రక్ష
యాచనము సేయ నిత్తు రయ్యభయ మిద్ది
నా వ్రతము, దీనిఁ గావింతు న్యాయమగును.183
తే. ప్రభువు వైనట్టివగు నభిప్రాయములను
విడిచి తన యభిప్రాయాలు వెల్లడించు
చుచు ప్రభుని కార్యములు చేయ చొప్పడెవఁ
డట్టి దూత సత్యమ్ము, వధార్హుఁడగును.184
తే. కోపరాహిత్యమును, క్షమ కుటిల మార్గ
మనుసరింపక యుంటయు నాపదలను
గలుగ నీయని భాషణ, గాఢ దుష్టు
లకడ నసమర్థమైన కర్మములు దెలుపు.185
తే. వంచకుఁడు పొగడు కొనెడివాఁడు నిర్ద
యత వ్యవహరించు వాఁడును నందరినిని
దండనము చేసి, వర్తించుచుండు వారు
సత్కరింపంగ బడెదరు జగము నందు.
(మంచివారికి రోజులు కావని అర్ధము)186
తే. లక్ష్మణా! సామమార్గాన రమ్యకీర్తి
యును, బ్రతిష్ఠయుగాని, యా యుద్ధజయము
గాని పొందుట సాధ్యమ్ము గాదు వినుము,
సర్వకాలమ్ము లందున సత్యమిద్ది.187
తే. ఓర్మి వహియించి యిట్లు నే నున్న నన్ను
శక్తి రహితునిగాఁ జూచు సాగరుండు
వ్యర్థ మిటువంటి వారిపై నరయ నోర్మి
సర్వ సమయాల నియ్యది సత్యము కద!188
తే. పురుషు డుపయోగపరుపఁగా బూనఁదగిన
ప్రముఖ వస్తువు దండంబు ప్రబలలోక
మునను ఆ కృతఘ్నులతోడ మునిఁగి వ్యవహ
రింప స్వాస్థ్యదాన క్షమల్ రిక్తములగు.189
మధుప్రప
217