Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నే గడివేసి వచ్చితిని నీ కెటు వచ్చెనొ! ఇట్టులైన నే
లాగున నిల్వగాగలమురా నిను పెట్టుకు ఊరిలోపలన్!"

“అడుగుల కడ్డువచ్చి తడియారని కన్నులతో కపోలముల్
వెడవెడ వెల్లనై సొగసు వీడగ వీడుట కొప్పుకోని నీ
యెడదను దిద్ద ఉన్నయటులే చనుదెండు యుగమ్ము కాదె మీ
కడ నిలువంగలేని క్షణకాలము నా కని యార్తవైతివే!”


చిన్ని కన్నయ్య అల్లరి అనిర్వచనీయం. చెరువుకు గండి కొట్టాడని ఒకరూ, జింకల గుంపును పొలంలోకి తోలాడని మరొకరూ, అరకల కర్లు లాగాడని ఒకరూ, మంచెలు విరగగొట్టాడని ఇంకొకరూ, గడ్డ పలుగులను కనపడనీయక మట్టిలో కప్పెట్టాడని వేరొకరూ, చెట్టుమీద దాచుకున్న దుత్తలోని పెరుగన్నం ఖాళీ చేశాడని కొండొకరూ - ఇలా గోపగోపికలు బాలగోపాలుడి చిలిపి పనులను యశోదాదేవికి చెప్పుకున్న సందర్భం సహజసుందరం.

దండిగా కొండేలు చెప్పిన నందవ్రజం వారి పలుకులు. విని 'కృష్ణుణ్ణి పట్టుకుందామని పరుగెత్తిన యశోదకు కాళ్ళు "కండెలు కట్టాయి. 'ముత్తైదువ' లాగా ఏమీ ఎరగనట్లు నీతిగా కూర్చున్నాడు కృష్ణుడు. జన్మతోనే "నటకాగ్రగణ్యు"డైన ఆ పిల్లవాణ్ణి ఆమె ఏం చేయగలుగుతుంది? అవి "ఈడుకు తగ్గ చేష్టలగునే?” అని వాళ్ళను మందలిద్దామంటే, వెంటనే 'చిన్నబిడ్డ లీ యీడుకు కొండలెత్తుచు ఫణీశు లతో చెరలాట మాడిరే!' అని, వాళ్లెక్కడ అంటారో అని మెదలకుండా ఊరుకుంది యశోద.

"తల్లికి నాకు తీరినది ధర్మము వీడుచు గంగ చేతిలో నుల్లము రాయి చేసుకొని యుంచిన యప్పుడె” అనీ, "స్వామికి ఉపాయనమై ఋణమెల్ల తీర్చెదన్" అనీ, "అతని సుఖమ్మె నా సుఖము అతని దుఃఖమె నాదు దుఃఖమై మతు లొకటై చరించితిమి మంచికి చెడ్డకు" అనీ, "ఇహపరా లేమైన నాకేమి నా ప్రాయం బిచ్చితి రాజరాజునకు నీ పాలోయి నా ఆత్మయే" అనీ కృష్ణుడితో కర్ణుడు పలికిన పలుకులలో అతని ఆత్మాభిమానమూ, ధర్మబుద్ధి, స్నేహశీలతా, కృష్ణభక్తి, ద్యోతకమైనాయి.


“జగము సమస్తమున్ నవరసాలము పోలిక సాంధ్యరాగపున్ జిగిని వెలుంగ”
"ఎద నదియై స్రవింప”


18

వావిలాల సోమయాజులు సాహిత్యం-1