తే. "తన్వి నా శరీరమ్మునఁదరిగె నగ్ని
ఎవఁడు నీ మాంద్యమింక తగ్గింపఁగలఁడు?
ఎదను బండింప మృదు మధు రేప్సితముల
నెవని నాఁగలి నీయెద నెఱిఁగి దున్ను. "
తే. "బావ! ప్రభవించె వింత స్వప్నమ్ము రాత్రి,
పొలము నైతిని నేను నీ తలఁపు నెఱిఁగి
నీదు నాఁగలి నను దున్ని నిలువ నెదియొ
యందు బిడ్డలవలెఁ బుట్టె నద్భుతముగ. 48
తే. "ఆట వెలఁదిని గానునే తేట గీతి
నెవరి హృదయమ్ము కడకైన నేగఁగలను
అదియె నా బ్రతుకునకు ననర్ధమయ్యె
పత్నిఁ గల్గినఁ బూనఁగా భయము గొల్పు.
తే. "ఎట్టి యాచ్ఛాదనమ్మున్న పట్టుబడదుఁ
బూర్వజీవితమున" కని పొలఁతి, విధవ
'హన్న' పెట్టెలో నాఫీసు కరిగి యచట
నాడె వెల్మౌంటుతో వివాహమ్ము నటులే.”
తే. "మల్లయుద్ధమ్ములో గెల్చి వెల్లికిలగఁ
జేయఁగల మల్లవీరునిఁ జేసికొనగ
భర్త, నిదె వచ్చితిని, మహాబలుఁడ వీవు
తన్వినని పోరు మాను టధర్మమయ్య.”
తే. "పొందవలె ప్రజ దేవతాపూజనముగ
శ్రద్ధతో నుల్లసముతోడ రతినిఁ బ్రీతి”
యనుచు నాచార్య రజనీషుఁ డన్నమాట
యౌనె సత్యమ్మటంచును నరయవలయు.
- 6. 'హన్న, వెల్మంటు'ల వివాహం ఫ్రాన్సులో 22/2/1789న జరిగింది - ఆంధ్రజ్యోతి, వార్త
164వావిలాల సోమయాజులు సాహిత్యం-1
164
వావిలాల సోమయాజులు సాహిత్యం-1