తే. నగర గణికల పరిశీలనమునఁ దెలిసె
“గణిక కే నరుపైఁ బ్రేమ కలుగ దెపుడు
వేశ్య యెందరఁ గల్గినఁ బ్రియజనాళి
స్త్రైణమవు ప్రేమ నర్థించుఁ ద్రాణగాగ.
తే. నగ్న భంగిమల మధుపానముల సేవ
గోష్ఠులందున జరిగెడి గొప్ప విందు
లందు నిలిపెదరు పురవృత్త్యంగనలను,
శోభలను, పెరీనలను నస్తోకముగను. 42
తే. మధుర మధురమ్ము భామినీ హృదయవీథి
అరయ నేకాంత దృష్టియం దద్దితోచు
నీలగగనమ్ము క్రింద నుద్వేలగతుల
వెలసి భాసిల్లు దేహళీ-విపణివోలె.
తే. 4"ఇమ్ము పదివేల డ్రాక్మాల ఇచ్చి, నీవు
కలుసుకొన నన్ను కోరింతు కడకురమ్ము
పొమ్ము కాకున్న చౌకగా నమ్ము కొనను
ప్రౌఢ జీవన నౌ నేను బాధపడెద.
తే. 5"మీరు క్రీడా విజేతలు మిత్రురాలి
తలఁపు నెఱిఁగి యే మొనర్తో తెలియఁ గోరి
యే లియోన్టిస్టు నీతోడ ఏంటియారు
తోడ శయనించి తొకరాత్రి గాఢరతుల.”
తే. "ఆమె స్వేచ్ఛకు అమెజాను" అనఁగ నద్ది (ఆమె)
స్తనము కోసి ధనుర్విద్య తాను నేర్చి
ప్రభువు రక్షణ కొఱకునై పార్శ్వచరిగ
నిలిచి, వర్తించు నాఫ్రికా నెలఁత వీర!"
- 4. లయన్ డెమస్తనీస్ లో అన్న మాటలు
- 5. క్రీడావిజయం కోసం అన్యోన్యం ఈర్ష్య వహించేవారిలో ఒకడితో ఒకడు
మధుప్రప163
మధుప్రప
163