తే. భర్త చావుకు హేతువౌ పడతి యొకతె
ప్రేమికుని ఎడ నెంతయో ప్రీతి నిలిపి
కడగి జీవిత శేషమ్ము గడుప దలప
అనతి కాలముననె యతడస్తమించె.
తే. ఇంతి నడయాడుత్రోవ ప్రార్థింతునెపుడు
క్రౌర్యమున నాదు ప్రేమను క్షయమొనర్ప
ఆమె పరిహాస మొనరించు హర్షమునకు
మృత్యు సన్నిధి చేరెద నిత్యమేను.
తే. చంచలములు స్త్రీ ప్రేమ సంచారచయము
నవ్యమై నిత్యముండు కాననములటుల
అన్ని వ్యవహారములలోన నతివ యుండు
ఇద్ది సత్య మటంచును నెరుగవలయు
తే. ప్రొద్దుననె స్నానమాడి సరోజ మొండు
సరసు నంతటి స్మృతులతో పరిమళింప
చేసె దానికి మూర్చిల్లి శీతకరుడు
కలతతో నందులోబడి కరిగిపోయె
తే. ముగ్ధ తారకాలి సరోజ ముకురములను
కలల సుందరముగ నలంకరణ గొన్న
దృష్టవలె నా సరస్సు ప్రత్యక్షమయ్యె
స్వప్నమది నాది పరిపూర్తి వడయలేదు
ఎంతగానో భాస్కరుండుదయించు వేళ
రంగుల హిమబిందు లెటులొ రక్ష చేసె
నస్తమించెడి నాదు ప్రాణాల నపుడు. 56
తే. అగును దోషమ్ము జనులు రతాభిలాష
అందు మూలాన పుట్టిన యామిషమ్ము
పాపమాంసమ్ము అద్దానివలన వారు
మూల పాపమ్ము నిత్తురు బాలలకును.
154
వావిలాల సోమయాజులు సాహిత్యం-1