తే. చేర దెల్ల పూలకు వికసించు శక్తి
గాలి కొన్నిటి వికసింప గడగనీదు
కొన్ని పూలకు నిట్టె చేకూరు నద్ది
అంతేకాదు సాధనసైత మవసరమ్ము. 45
తే. మనుజ హృదయమ్ము ఇట్టిదై మనును దాని
కర్హమగు సాధనెంతయో అవసరమ్ము
అన్ని కల్గియు వికసించు టతిశ్రమమ్ము
అన్యమును నట్లు గావించు టతిశయమ్ము.
తే. వివృత హృదయ కవాటమ్ము విసిగియైన
సంవృతత్వము నొందగా శక్తిహీన
వికసనముగొన్న ప్రసవమ్ము వేరె లేదు
వాడిపోవలె, ముకుళన వడయలేదు.
తే. కోరి హృదయమ్ము నర్పించుకొన్న వనిత
ఇడుమ లెన్నిటినైన సహింపగలదు
తనివితీరగ ప్రేమామృతమ్ము జుఱి
విడిచిపెట్టిన దేహమ్ము విడిచిపుచ్చు.
తే. పంచజేరు ననాథుడౌ బాలు నొకని
ప్రేమతో జేరగా దీసి పెంచె వేశ్య
ఆర్జనతో వానికిని చదువబ్బజేసె
ఆమె వేశ్యని గ్రహియించి అతడు విడిచె.
తే. ప్రక్క వైద్యుని ప్రాక్టీసు పాడొనర్ప
లేవగా దీసుకొనివచ్చి స్త్రీ నొకర్తె
నొప్ప జెప్పి భంగపరుప నువిద అయ్యె
పాత్రురా లతడ తమికి, పరిచి క్షమను.
తే. భర్త గతియింప పిల్లల బ్రతుకు కొరకు
ఏ యుపాయమ్ము నెరుగని ఇంతియొకతె
మానవతియయ్యు తప్పక మాన మమ్మి
జీవనము చేయ దోషమ్ము సేత కాదె. 51
మధుప్రప
153