Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే. జాగరూకత రూపాలు చాల విషమ
    మైన యది ప్రణయార్థ మైనట్టి దద్ది
    ప్రియయు ప్రియుడును వీక్షించి పిలుచు మొదలు
    సర్వ సౌఖ్యాల నతిగ నాశన మొనర్చు.

తే. పోస్టులో నుంచి తనకయి పుట్టివచ్చు
    నట్టి దానిని ప్రేమలేఖనుచు తలతు
    రా టెలీఫోను మ్రోగిన యప్పుడెల్ల
    అర్థి వినదలచెదరు ప్రియ స్వనమ్ము.

తే. వీక్షణము పొందకుండను పిల్వకుండ
    వచ్చు ప్రణయ మొకానొక వ్యక్తి కడకు
    అద్ది పరమమౌన నవకాశాది బాంధ
    వముల చేకూర్చునెంతో అవ్యాహతముగ

తే. ఆమె 'నెందుకు వృద్ధు పెండ్లాడి' తనగ
   'తండ్రివలె నుండగా నేర్చి తనకు గల్గు
    మానసోద్రేక విషయాలు చర్చింప మనసునిచ్చు
    గాన పెండ్లాడితని తెల్పు కమ్రగాత్రి.

తే. అయిన నిక ప్రణయోద్రేక మతిశయించి
    వారిలో గొన్న నయ్యది వారి మనసు
    నుండి ఇతరమ్ము సర్వమ్ము నూడబెరుకు
    ఇరువురొకరొకరిని తప్ప ఎరుగరెదియు.

తే. అతడి సహచర్యమ్ముతొ నుంట నామె పొందు
    వారితో సౌఖ్యమెంతొ అపారముగను
    అంత కొన్నాళ్ళలోననా యతివ కగును
    వారిపై సర్వమునకు నాధారపడుట. 12

    ఆహా ప్రియా, మనము ఒకరికొకరము సత్య
    మొలికించు కొందము - మనమందు తోచేటి
    ఈ జగము కనిపించు అంత భిన్నముగాను
    అంతరమణీయముగ, అతినవ్య నవ్యముగ

మధుప్రప147


మధుప్రప

147