Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'పితామహుడు'


ఉ. మూవురు తాతలున్ ముగురు మూర్తులు - దివ్యుడు దివ్యలో
    భావితకీర్తి తేజులు. నివారితద్వంద్వులు - యజ్ఞవాటికా
    పావన నిత్యనూతన సుపాతక కల్పిత కాలలీమూర్తు లి
    మూవురలోన నెవ్వరయ ముచ్చట కల్గెడి కన్నుదోయికిన్.

చ. ములుకుల వోలె బాధ యొక మూలన నన్ను పరాభవించు నౌ
    నిలచిన చోట నిల్వకను నీ పరిపూత లసత్శరీర సం
    చలిత నవాంశు వాపిచనుటం జల్లగ తప్పుకొనంగ నేల? నే
    పలుకున లేదు, కంటి పెను మంటలు దగ్ధము చేయ చూచెదన్.

మ. అనిమేష స్థితి నొందినందుల కహో! ఆరెప్పలల్లార్పకే
    నను మీ వంశపు మొల్క నిట్లదయతోన్ నాశమ్ము గావింపరే
    అనుమానమ్మును కాక పంపెదవుగా అగ్నిచ్చటల్ తండ్రి ఆ
    నన తైక్ష్యమ్ము హరింపుమా దివిషదన్న ప్రాయమై పోవగా.

ఉ. మావలె యజ్ఞవేదికలు మేదుర దివ్య మహాగ్ని హోత్ర లీ
    లావిభవంబునన్ మెరసి లక్ష్యము నాకము పైన నిల్పి రం
    భా విపులావృత స్తనసభాంతర మంజుల నాట్యశాలపై
    నీవు చరించి లాస్యమొనరింపవె కోరను బుద్ధి నెన్నడున్.

ఉ. దేశము పాప పంకిలము తిన్నని దోవలు మాసిపోయె నా
    కోసము లోక మెల్లెడల కూర్చొని యున్నది కంటవత్తితో
    పాశంబులన్ తెమల్చుకొని భారత యోధుడనై జనించి, స
    న్యాసము నొంది నాస్తిక వినాశ మొనర్పవలెన్ పితామహా!

చ. పరమ వివేక సౌరభ ముపాయమనన్ నరజాతి కిచ్చినే
    సురపురి కేగుదెంచి మిము చూచెద యజ్ఞము, కర్మకాండయున్
    స్థిరముగ లోకలోకముల శిక్షణ నొంది యొనర్ప చూచినే
    తరలెద లింగదేహమున తావకదివ్య పథమ్ము జేరగన్. 6


140

వావిలాల సోమయాజులు సాహిత్యం-1