తే. సంజవేళను నెత్తిన అంజలందు
కడగి ప్రతిబింబితమయిన గౌరి వదన
పద్మమును జూచి తా మంత్ర పఠన మరచి
పెదవులను త్రిప్పి హరుని సేవింతురీరు.
తే. పైకి లేచిన జ్వాల లపరిమితముగ
ప్రియుని మృతి దాక గాఢమాలింగనమ్ము
చేసుకొనుట జనించిన చెమటతోడ
పడతిచే నగ్ని అణపగా బడుచునుండె. 36
తే. మలయ పవనమ్ము తహ తహ చెలగు చుండె,
అత్త వెడలుట కొప్పుకో దవతలకిని
ఇంటిలో నున్న అంకోల వృక్ష మధుర
పరిమళము చంపుచున్న దపారముగను.
తే. జార ప్రియు చితాభస్మ సంస్పర్శవలన
అబ్బు సౌఖ్యమున శరీర మంత చెమట
పట్టుచుండుట నూత్న కాపాలికైన
ఆమె భస్మ లేపనము ముగియంగలేదు.
తే. బుద్ధ పదబంధనముజేయ బూనిక్రింద
ప్రేమ సాష్టాంగపడి యెడు భిక్షు సంఘ
మటుల శుకముఖములతో ఫలాశపుష్ప
చయముతో భూమి శోభా సుసమయమొందె.
తే. పొలము నెవ్వరితో నున్న భూమియందు
ఏలసఖి వంచి ముఖమీటు తేల్చెదీవు?
అదిగో శనగచే నర్దళ మద్దబడిన
నర్తకీ ముఖమయ్యె నానంద మొసగ.
తే. ముఖమునను రంగు నేతిని పూసియుంట
ముక్కు నాల్క తగులనట్లు ముందుచాపు
నామె పెదవిని పెట్టిన యట్టి ముద్దు
మే మిపుడు స్మరియించు చున్నాము నేడు.
124
వావిలాల సోమయాజులు సాహిత్యం-1