తే. అట్టి మంత్రికులోత్తంస మహిత నృపతి
పటల మకుటాగ్రఘటిత తత్పద్మయుగళ
సకల సామ్రాజ్యరక్షా విచక్షణుండు
దీన సురశాఖి సాళువ తిమ్మమంత్రి.
చ. “స్తుతమతియైన వాడు కవిధూర్జటి - నిండెను వాని వాక్కులం
దతులిత మాధురీ మహిమ ?" యంచును లోకము మెచ్చె - నం చు నను
చితమును, ముగ్ధ మీ గుణ విశేషము కల్గెను నాకు పార్వతీ
పతిపద మంజులాబ్జ మధుపాన మధువ్రత మత్తతన్ రహిన్.
చ. “స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేలఁగల్గె నీ
యతులిత మాధురీ మహిమ?" హా, తెలిసెన్ భువనైక మోహనో
ద్ధత సుకుమార వారవనితా జనతాఘనతాప హారిసం
తత మధురాధరోదిత సుధారస ధారల గ్రోలుటన్ జుమీ!
చ. "స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేలఁగల్గె నీ
యతులిత మాధురీ మహిమ" ఔ తెలియందగు లోకమోహనో
ద్దత సుమసాయక ప్రబలతాప హరోజ్వల పూజ్యపార్వతీ
పతి పద మంజులాబ్జ మధుపాన మధువ్రతుఁడై చెలంగుటన్”
ఉ. నెయ్యముతోఁ ద్రిలోకజననీ జనకులే మది మెచ్చి యిచ్చటన్
దియ్యని చూపు చూచి, సముదీర్ణ మహార్థములనిచ్చి, సా
హాయ్య మొనర్చి, కీర్తిలతికావళి దిక్కులఁ దావి నింప బా
లయ్య మహోదయున్, గను, మహాశయు, దేశిక వర్యుఁ బ్రోచుతన్.
118
వావిలాల సోమయాజులు సాహిత్యం-1