'కృష్ణరాయలు, తిమ్మరుసు '
శా. "శ్రీరుద్రమ్మిది, లంకనుండియె యశశ్రీరాజ్యముం జేయు మ
న్నా రామా!" యనఁ దమ్ముఁ "డొల్లనిది స్వర్గం బైననొల్లన్, సురా
గారం బేన్ సరిరాదు జన్మభువికిన్ కన్నమ్మ కం”చాడు సీ
తారామాపతి కృష్ణరాయ నృపతిన్ ధర్మ ప్రభున్ బ్రోచుతన్.
ఉ. పాయని యుక్తి స్వః ప్రజల, భండన శక్తిని శాత్రవాళి, ని
శ్రేయస భక్తి దేవతల, చిత్తజరక్తి వధూగణమ్ము, రా
ధేయత యాచకావళి, విధేయత విజ్ఞులఁ దన్ని వెల్గు నీ
రాయలవంటి రాజు కనరాఁడు గదా యెట రాజమండలిన్.
చ. దయయని లేదు శాత్రవ విచారణ కేళుల కృష్ణరాయ! లో
భయపడెదీవు భామినుల ప్రౌఢ కటాక్షము తప్పెనేని, అ
వ్యయమగు నీ గుణ ద్వితయ మా నెఱజాణను, కీర్తికామినిన్
ప్రియ నొనరించి పంపె విహరింపగ త్వద్భుజ పంజరంబునన్.
శా. లేరెవ్వారలు ధైర్యధుర్యులగు సుర్వీనాయకుల్ ధర్మమం
దారవ్రాతము రక్షసేయుటకు నుద్యన్మేరువుల్, భూమి భూ
దారుల్ మీ ఘనవంశజన్ములె దయాధారుల్, విరూపాక్ష కే
దారాధీనులె నేఁడు దేశమున కాధారమ్ము చర్చింపఁగన్.
సీ. ఏ మంత్రిమణి నిజస్వామి కార్యక్రియా
తత్పర మానసోత్సాహశాలి,
ఏ మంత్రిమణి మిత్ర హితబాంధ వాశ్రిత
ప్రకర రక్షణ కళాప్రౌఢబుద్ధి,
ఏ మంత్రిమణి వచోహేలాతి నైర్మల్య
శీతలతాధూత శీతరోచి,
ఏ మంత్రిమణి సుధాధామ, శాంభవధామ
ధాళధళ్య సుతుల్య ధవళకీర్తి,
మధుప్రప
117