పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

వాసిష్ఠరామాయణము

నందొప్ప నంతఃస్థ-మై యుండు భూమి,
యందెన్నఁ బరమాణు - వనఁ దోఁచు నాత్మ

యందుఁ దద్రూపమై - నట్టి మనంబు
నందు సర్వజగంబు - లద్భుతంబుగను

గనఁ బ్రతిభాపాత్మ - కంబులై యుండు'
సన విని లీల యి-ట్లనె సంశయమున

'జనని' యావిప్రుండు - చనిపోయి నేటి
కెనిమిదినా ళ్లంటి - విచ్చట నాకు 1080

నెన్నఁగా డెబ్బది - యేం డ్లయ్యె. నిట్టు
లున్న కలఁకఁ దీర్చు - మోతల్లి ! యనిన

విని వాణి పలికె నో విరిఁబోణి ! నిజము
పనుపడ నాలించు - ప్రతిభాసకన్న

నల దేశ కాలముల్ - హ్రస్వముల్. దీర్ఘ
ములు లేవు. చిద్రూప-మున కన్న వేఱె

ప్రతిభాసలే దట్టి - ప్రతిభాసవిదము
సతి! విను మెట్లన్న - జంద్రచంద్రికల

కరణి భేదా భేద - కలితంబు లగుచుఁ
బరమచిత్తుసు చిత్ర - భాసలు వెలుఁగుఁ 1090

జిత్తానఁ [1]బ్రతిఫలించిన కారణమునఁ
జిత్తు జీవాత్ముఁడై సృష్టితోఁ దగిలి

మరణ మూర్ఛలఁ బొంది - మదిఁ బూర్వ సరణి
మఱచి, క్రమ్మఱఁ బుట్టి మాయచే జిక్కి

  1. ప్రతిభవించిన కారణమున - శ.