పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిప్రకరణము

49

తలఁపు లన్నియును జి-త్తమున వసించి
కలలందు సుఖము, దుఃఖమును జీవునకుఁ

బరిపరి విధములఁ - [1]బాపపుణ్యముల
సరణులఁ దోఁపించి, - జాగ్రదవస్థ

మరల వచ్చిన [2]నన్ని - మాయంబులైన
కరణిని మరణంబు - గలిగిన వేళ

బొందిలో మును పుండి - పుణ్యపాపముల
నిందుఁ జేసిన వెల్ల - నెనసి వెన్నాడి

చనఁగ, లింగశరీర - సహితుఁడై స్వర్గ
మున మహాసుఖము ని - మ్ముగ నారకముల 1060

యందు దుఃఖము పూర్వ - మవనిపైఁ గలలఁ
జెంది తా ననుభవించిన చందములను

ననుభవించిన మీఁద - నవనిపై మరల
జనియించి, పరలోక - సౌఖ్యదుఃఖముల

మఱచుచు సంసార - మాయలోఁ దగిలి,
పరువడి పుణ్యపా-పంబులు చేసి,

చని పుట్టు, నిటువంటి - చావు, పుట్టుకలు
కలిసి జీవునకుఁ గ ల్గిన చందమునను

గనిపించు నజ్ఞాన - కలితులై నట్టి
మనుజున 'కని చెప్పి - మరల నిట్లనియె: 1070

ముదితరో ! సంకల్ప ముకురంబు పోలెఁ
గుదురు [3]చిదాకాశ - కోటరమునను

  1. బాప పుణ్యాను వా
  2. నందు మాయంబులైన-- వా
  3. చిదాకాశ కోశ కోటరము