పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

వాసిష్ఠరామాయణము

మఱియేమి చెప్పె స-మ్మతముగా నాకుఁ
దిరమైన దయతోడఁ -దెలుపవే!' యనుచు660
నడుగ, భరద్వాజు-నాత్మలో మెచ్చి
యడర వాల్మీకి యిట్లని చెప్పఁదొడఁగె:
'వినుము భరద్వాజ! - విజయ రాఘవుని
గని వసిష్ఠుండు సత్-కరుణ నిట్లనియె:
'ధరణీశ! యుక్తియు-క్తములైన పాఠ్య
సరణి బాలుండైనఁ - జక్కఁగాఁ జెప్పె
[1]నేని నీ వాలించు - నిజముగా నెంచు,
మా నలినోద్భవుం - డైన నయుక్త
వచనముల్ చెప్పిన - వాంఛతో వినకు,
మచలుండవై సత్య - మాత్మ నూహించు;670
మాకాశ జాఖ్యాన - మాదిఁ జేసికొని
ప్రాకటంబుగ దశో - పాఖ్యానములను
నీకుఁ జెప్పెద, నది - నెళవుగా, దెలియు
[2]మాకాశజము సూక్ష్మ - మై చోద్యముగను
మొదటఁ దోఁచక యుండి - మూలవస్తువును
తుద నాత్మదృష్టికిఁ - దోఁపింపుచుండుఁ;
బొలుపొందఁ బ్రతిపత్తి, - భూతి, వేదనలు,
[3]నలయఁ బరోక్షంబు - నని చెప్పు నొప్పు


  1. నేని భావించు, నిజముగా నెంచు-వా
  2. మాకాశము నిజసూక్ష్మంబైన చోట - వా
  3. నల యుపమోక్షంబు నని చెప్పనొప్పు - వా