పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిప్రకరణము

15

జేరి, పిండంబై, వి-చిత్రావయవము
లారూఢిఁ బొడమి త-న్నావరింపఁగను,
గర్భగత జ్ఞాన-కలితుఁడై యచట
నర్భకుఁడై యుండి-యలమటల్ పడుచు.
వెడలు దా రెఱుఁగక-వివశుఁడై దుఃఖ
పడుచు, నక్కడ నుండి-పదియవ నెలను290
ధరణిపైఁ బడి, తన-తల్లియుఁ దండ్రి
పేరిమి బోషింపఁ బెరుగుచునుండి,
యవల బాల్యావస్థ-యౌవనావస్థ
లవని ననుభవించి,-యట వృద్ధుఁ డగుచు,
భోగేచ్ఛఁ జేసిన-పుణ్యపాపముల
తోఁ గూడి కమ్మకుఁ-దొల్లిటివలెనె
పడిపోయి, పుణ్యపా-ప ఫలంబు లచట
చదయక మోద, ఖే-దముల నియ్యఁగను
నాక నారకముల-నవ్య భోగమును,
[1]శోకం బనుభవించు చును సొక్కి స్రుక్కి,300
యెప్పటి రీతిగా నిలమీఁదఁ బుట్టు;
నప్పుణ్యపాపంబు-లం దిందు నరుని
నెప్పుడు నెడఁ బాయ-కెల్లలోకములఁ
ద్రిప్పుటే కాని, ము-క్తినిఁ బొందనియవు.
బావిలో నేతము-బాన తామునిఁగి
యా వేళనే జలం-బందుండి తాను


  1. శోకం బనుభవించి సొక్కి స్రుక్కినను-వా.