పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

వాసిష్ఠరామాయణము

రాముని ఆర్తి


జేరి చేతులు మోడ్చి: శిర మర [1]వాంచి,
యా రాముఁ డాత్మయం-దార్తి వహించి,
తన చింత రెట్టింపఁ - దనువు గంపింపఁ,
గనుల బాష్పము లొల్కగాఁ - దీను పగిది
నున్న, రాముని చంద - మూహించి, మౌని
'యన్న! ర'మ్మని పిల్చి - యాదరింపుచును,
తనువెల్ల నిమురుచుఁ - దాప మొందుచును
ముని దయ మీఱ రా-మున కిట్టు లనియె:

విశ్వామిత్రుని ఆదరోక్తి


'నాతండ్రి! రఘువర! - నాటుగా నిపుడు
నీ తండ్రి రాజ్యంబు - నెమ్మదిగాను190
పాలింప యువరాజ - పట్టభద్రుండ
[2]వై లలితసుఖంబు - లనుభవింపకను
ఎలుకలు ద్రవ్విన-యింటి చందమునఁ
గలఁగుచు [3]దిగఁబడఁ - గారణంబేమి?
[4]పట్టైన యౌవన-ప్రాయంబునందు
నెట్టన సుఖముల-నేఁ బొందవలయు,

  1. వంచి. వా.
  2. వై లలి సుఖము లె-ల్లనుభవింపకయ. వా.
  3. దిగులొందఁ గారణంబేమి? వా.
  4. పట్టి! నీ యౌవనప్రాయంబునందు. వా.