పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

xxix కృతజ్ఞతాంజలి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాజ్మయ పరిష్కరణ ప్రాజెక్టును నెలకొల్పటంలోనూ, దానికి శాశ్వత స్థితిని ప్రసాదించటంలోనూ ఆదినుండీ మూలవిరాట్టుగా విలసిల్లుతూవున్న శ్రీవారి ప్రతినిధులు, సహృదయ పతంసులు, సుగృహీత నామధేయులు, పరిపాలనా దక్షులు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి అధ్యక్షవర్యులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి మహెూదయులకు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యు లెల్లరకు నా అనేక ధన్యవాదములు. శ్రీవారి ప్రతినిధులు స్మితపూర్వభాషులు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పాజ్మయ పరిష్కరణ ప్రాజెక్టుకు చిరస్థాయి యయిన అభ్యుదయాన్ని, సమగ్రతను ప్రసాదిస్తూవున్న సహృదయతంసులు తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారివర్యులు, పరిపాలనాదక్షులు, నుగృహీత నామధేయులు శ్రీ కె.వి. రమణాచారి, ఐ.ఏ. యస్., మసూదయులకు నా అనేక ధన్యవాదములు. తి.తి.దే. సంయుక్త కార్యనిర్వహణాధికారి, సౌజన్యహృదయులు శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి గారికి నా అనేక ధన్యవాదములు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాజ్మయ పరిష్కరణ ప్రాజెక్టు యొక్క పర్వతోముఖమైన వికాసానికి తమ వ్యక్తిత్వ లక్షణమైన ఉద్యమస్ఫూర్తిని సమన్వయించి ఉత్సాహ. ప్రభు, మంత్రశక్తి పూరితమైన దక్షతతో ముందుకు నడిపిస్తూ వున్న తి.తి.దే. “శ్వేత" సంచాలకులు, "భూమన్' గా సుగృహీతనామధేయులైన శ్రీ భూమన్ నుబ్రహ్మణ్యం రెడ్డి మహెూదయులకు నా అనేక హృదయపూర్వక ధన్యవాదములు. తి.తి.దే. పౌరసంబంధాధికారివర్యులు, సరసహృదయులు శ్రీయుతులు కె. రామ పుల్లారెడ్డిగారికి నా అనేక కృతజ్ఞతాభివాదములు.