చతుర్ధప్రకరణము
225
వినుము చెప్పెద సర్వ - విశ్వంబు చిత్త
మున, నయ్యహంకార - మునఁ గల్గి, చాల 540
వెలయుచు వేవేళ - వివిధభేధములఁ
జలియించు టది చిత్త - చపలత గాని,
యరయ నన్యంబుగా-దని నీవు దెలియు
కొఱకు బిల్వఫలంబు - గుఱుతుఁ జెప్పితిని;
నిరతంబు పరసత్తు - నిర్వికల్పయును,.
గరమొప్పు నట్టి య- ఖండైకరసయు,
నగణితం బగునట్టి - యర్ధంబు విశద
ముగఁ జేయుటకు మది - ముదము రెట్టింప
భాసురంబుగు శిలో-పాఖ్యానసరణి
వాసిగాఁ జెప్పెద - వసుధాతలేంద్ర ! 550
పావనం బతిగోప్య - పద మదే గనుక
సావధానముగాను - జక్కఁగా వినుము !
మహాశిలోపాఖ్యానము
అది యె ట్లనన్న మ-హామృదులంబు,
నదమల తేజ, మా- శ్చర్యకరంబు,
పారి పరంధ్రయును, సం- పూర్ణయు నగుచుఁ
జిరతరంబై యొక్క - శిల యుండు' ననిన
విని రాముఁ డనియె నో - విమలమునీంద్ర !
పెనుపొంద మీరు చె-ప్పినది చిత్పదము
ఘనము, శిలయు, నేక - కళయు, నరంధ్ర
మును దా నగుచునుండి - మొనసి లోకముల. 560